మరో మృతదేహం లభ్యం
— మోరంచపల్లిలో బయటపడుతున్న మృతదేహాలు
ప్రజా దీవెన/ జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మరో మృత దేహం బయటపడింది. జిల్లా లోని మొరంచపల్లి గ్రామంలో వరదలో గల్లంతయిన గంగడి సరోజన మృతదేహం లభ్యమైంది. దీంతో మృత దేహాలు బయటపడే పరంపర కొనసాగుతుండడంతో జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయని చెప్పవచ్చు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగిపొర్లడంతో ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే.గ్రామ ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేయడంతో చివరకు సీఎం ఆదేశాలతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గ్రామ ప్రజలను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా హెలికాఫ్టర్లు, బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద బీభత్సానికి అప్పటికే పలువురు గ్రామస్థులు గల్లంతు కాగా ప్రస్తుతం మోరంచవాగు వరద తగ్గడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మొన్న రాత్రి గల్లంతైన గొర్రె ఆదిరెడ్డి, వజ్రమ్మ మృతదేహాలు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో కనిపించాయి. తమ వారి మృతదేహాలు బయటపడుతుండటంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలాఉండగా జిల్లాలో వరద బీభత్సానికి 11 మంది మృతి చెందగా మరో ఏడుగురి ఆచూకీ గల్లంతయింది. వరద ఉధృతితో ఊళ్లు మొత్తం తమ రూపురేఖలకు కోల్పోయి పల్లెల్లో ప్రజలు సర్వం కోల్పోయి ఆగమైన పరిస్థితి నెలకొంది. కట్టలు తెగడంతో పంట పొలాలు నీట మునిగి రైతుల ఆశలు లబోధిబోమoటున్నారు. I క్రమంలోనే భూపాలపల్లి జిల్లాలో 40 చెరువులకు గండ్లు పడ్డగా పూర్తిస్థాయిలో రోడ్ల విధ్వంసమయ్యాయి. మోరంచపల్లి వద్ద జాతీయ రహదారి కొట్టుకపోవడం , జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థ స్థంభించింది. వర్షాలకు దాదాపు 13,270 ఎకరాల్లో వరి నారు నీట మునిగగా 11,891 ఎకరాల్లో పత్తి నష్టం వాటిల్లడం మరో 1,800 ఎకరాల్లో ఇసుక మేటలు పెరుకున్నాయి. మోరంచపల్లిలో 153 బర్రెలు, 753 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాదాపు 50 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి..
*భద్రకాళి చెరువుకు గండి…* వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. వరద ప్రభావం అధికమవడంతో చెర్వుకు గండి పడడంతో పోతననగర్, సరస్వతినగర్ కాపువాడ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉండడంతో అయా ప్రాంత ప్రజలు భయాందోనకు గురవుతున్నారు. నివాస గృహాలవారిని పునరావాస కేంద్రాలకు తరలిoచెందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.