–వైద్య చికిత్సల ధరలను ప్రభు త్వం సవరిస్తూ ఉత్తర్వులు
–1375 వైద్య చికిత్సల ధరల్లో మార్పులు చేర్పులు
Arogya Sri:ప్రజా దీవెన, హైదరాబాద్: పద కొండు సంవత్సరాల తర్వాత రాజీ వ్ ఆరోగ్య శ్రీ (Arogya Sri) పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్య దర్శి క్రిస్టినా జడ్ (Christina Jud)చోంగ్థు ఉత్త ర్వ్యులను జారీ చేశారు. సోమవా రం సచివాలయంలో ఆరోగ్యశ్రీ చికిత్స ధరల సవరణ జీవోను వైద్య ఆరోగ్యమంత్రి దామోదర రాజన ర్సింహ విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద మొత్తం 1,672 వైద్య సేవలు అందుబాటులో ఉండగా వీటిలో 297 మినహా మిగిలిన వైద్యసేవ(ప్యాకేజీ)ల రేట్లను పెంచారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 ప్యాకేజీలను చేర్చినట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ సర్కారు రాజీవ్ ఆరోగ్య శ్రీ చికిత్సల ధరలకు సంబంధించిన రివైజ్డ్ రేట్ల గురించి ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదని, కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక సగటున 20–25 శాతం మేర చికిత్సల ధరలను పెంచు తూ నిర్ణయం తీసుకున్నామ ని తెలిపారు.
తాజా నిర్ణయం వల్ల సర్కారుపై ఏటా అదనంగా రూ.48 7 కోట్ల భారం పడుతుందని, ధరల సవరణ ద్వారా 79 లక్షల కుటుంబా లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరో గ్యశ్రీ (Arogya Sri)నెట్‌వర్క్‌లో 1,042 సర్కారీ దవాఖానాలుండగా, 368 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. తాజా రేట్ల ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుం బానికి ఏటా రూ.10 లక్షల మేర ఉచిత వైద్యం అందుతుందని జీవోలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబరులో ఈ పథకం పరిమితిని కాంగ్రెస్ సర్కారు రూ.5 లక్షల నుం చి రూ.10 లక్షలకు పెంచింది. అలా గే కొత్తగా 163 ఆరోగ్య ప్యాకేజీలను గుర్తించింది. తాజాగా చికిత్స ధరల పెంపు కారణంగా రూ.140 కోట్లు, కొత్త ప్యాకేజీల చేర్పు వల్ల మరో రూ.348 కోట్లు మొత్తంగా రూ.488 కోట్ల మేర ఏటా సర్కారుపై అదన పు భారం పడనుందని వైద్యవ ర్గాలు వివరించాయి. కొత్త ప్యాకేజీల వల్ల 1.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గుండె చికిత్సలో కొత్తగా 12 ప్యాకేజీలు: కొత్తగా ఆర్యోగ్యశ్రీలో 163 ప్యాకేజీలను ప్రవేశపెట్టగా వాటిలో గుండె చికిత్సకు సంబం ధించి 12 ప్యాకేజీలు ఉన్నాయి. వాటిలో కార్జియాలజీ, కార్డియో థొరాసిక్ (Cardiology, Cardio Thoracic)సర్జరీలు ఉండగా, మెడిక ల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్(సీహెచ్‌ఎఫ్)/స్టక్ మెడికల్ మేనేజ్‌మెంట్‌కు రూ.44 వేల ప్యాకేజీని ఖరారు చేశారు. అలాగే డెర్మటాలజీలో 2, ఎండో క్రైనాలజీలో 7 ప్యాకేజీలు చేర్చగా, ఇందులో డయాబెటిక్ కీటో ఎసిడో సిస్‌కు రూ.44 వేల ప్యాకేజీ ఖరారు చేశారు. అలాగే జనరల్ మెడిసి న్‌లో 3, జనరల్ సర్జన్‌లో 15, జీరియాట్రిక్ మెడిసిన్‌లో 1, ఇంట ర్వెన్షనల్ రేడియాలజీలో 17, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో 9, నెఫ్రాలజీలో 16, న్యూరాలజీలో 8, న్యూరో సర్జరీలో 18, న్యూక్లియర్ మెడిసిన్‌లో 3, ప్లాస్టిక్ సర్జరీలో 9, పల్మనాలజీలో 3, రేడియేషన్ ఆంకాలజీలో 3, రుమటాలజీలో 7, సర్జికల్ ఆంకాలజీలో 9, యూరాల జీలో 11, వాస్క్యులర్ సర్జరీలో 6 ప్యాకేజీలు కొత్తగా చేర్చారు. అలాగే ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ, టైప్–1 డయాబెటిక్‌కు ఇన్సులిన్ పంప్స్, అఫెరిసిస్ వంటివి ఆరోగ్య శ్రీలోకి కొత్తగా తీసుకురాగా ఇన్సులి న్ పంప్స్‌కు రూ. 2 లక్షల వరకు ప్యాకేజీ నిర్ణయించారు.