Joint Nalgonda District Review Meeting : ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షా స మావేశానికి ఏర్పాట్లు పూర్తి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి
Joint Nalgonda District Review Meeting : ప్రజా దీవెన నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి,మైనార్టీ సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి ,రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ,రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు,ఎం ఎల్ సి లు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జి ల్లాల కలెక్టర్లు, అధికారులు హాజ రుకానున్న ఉమ్మడి జిల్లా సమీక్ష స మావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం ఆమె సమీక్ష సమావే శం నిర్వహించనున్న ఉదయాదిత్య భవన్ ను సందర్శించి వేదిక, తది తర ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యంగా సమీక్ష సమావేశానికి ఆయా జిల్లాల వారీగా సమీక్షించే అంశాలపై నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ , తదితర ఏ ర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుం డా చూసుకోవాలని సంబంధిత అ ధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశం అనంతరం మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు 6 కోట్ల రూపాయల వ్యయంతో టిటిడిసి వద్ద నిర్మించిన నూతన ఆర్ అండ్ బి ఎస్ ఈ కార్యాలయాన్ని ప్రారం భించనున్న దృష్ట్యా అక్కడ అవసర మైన అన్ని ఏర్పాటు చేయాలని ఆ మె ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్ తో కలిసి నూతన ఎస్ ఈ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిం చారు.బుధవారం (2.7.2025) నాటి మంత్రుల కార్యక్రమంలో భా గంగా మంత్రులు ఉదయం 8 గంట లకు నల్గొండ చేరుకుంటారని, ఉద యం 10:45 నిమిషాలకు జిల్లా కలె క్టర్ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఉదయాదిత్య భవన్ చేరుకొని అ క్కడ నల్గొండ, సూర్యాపేట, యా దాద్రి భువనగిరి జిల్లాలకు సంబం ధించి అధికారులతో సమీక్ష నిర్వహి స్తారని తెలిపారు. సమీక్ష అనంత రం మధ్యాహ్నం 3.30 గంటలకు టీటీడీసీ వద్ద నూతనంగా నిర్మిం చిన ఆర్ అండ్ బి ఎస్ ఈ కార్యా లయాన్ని ప్రారంభిస్తారని, అనంత రం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని ఆమె తెలిపారు .
నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ బి.వెంకటేశ్వరరా వు, ఈ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఈ ఫణి జా, గణేష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ పుణ్య,కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్, తది తరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నా రు.