–ఎన్నికల హామీని అమలు చేయాలి
–సీఐటీయూ
ASHA workers : ప్రజాదీవెన నల్గొండ : ఆశా వర్కర్లకు పారితోషికాల విధానం రద్దుచేసి కనీస వేతనం 26000 నిర్ణయించి ఎన్నికలలో ఆశలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య నల్గొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం నల్గొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాములబండలో జరుగుతున్న ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు జరిగే విధంగా అందరికీ వైద్య సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు పారితోషికాల పేరుతో కనీస వేతనాలు లేక కుటుంబాలు నడపలేని పరిస్థితులలో ఆశాలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 18 వేల వేతనం అమలు చేయాలని, ఏఎన్ఎం విద్యా అర్హత కలిగిన ఆశలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. యూనిఫాం బకాయిలు ట్రావెలింగ్ అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఆగస్టు మూడున ధోడ్డి కొమరయ్య భవన్లో జిల్లా స్థాయి ఆశా కార్యకర్తల విస్తృత సమావేశం జరుగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి ఆశాలు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు భారతి, మంగమ్మ, సంతోష, తేజేశ్వరి, సైదమ్మ, చైతన్య, శోభారాణి, కవిత, జ్యోతి, పారిజాత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.