Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Assembly budget meetings:భరోసా బడ్జెట్..!

–నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
–పక్కా పది రోజుల పాటు జరిగే అవకాశం
–పూర్తిస్థాయి బడ్జెట్‌ తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ, ఆమోదం
–విద్య, వ్యవసాయ కమిషన్‌, స్కిల్‌ వర్సిటీ బిల్లులకు ప్రభుత్వ నిర్ణయం
–జాబ్‌ క్యాలెండర్‌, రైతు భరోసాపై విధాన ప్రకటనకు సీఎం సంసిద్ధం
–బీఏసీ భేటీ అనంతరం తొలిరోజు లాస్య నందిత మృతికి సంతాపం
–ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేం దుకు బి ఆర్ ఎస్, బిజెపి నిర్ణయం
–అస్త్రశస్త్రాలతో సంసిద్ధమవు తోన్న అధికారపక్షం

Assembly budget meetings:ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (Telangana State Legislature Budget Session Hall) మంగళవారం ప్రారంభం కాను న్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమా వేశాలు ఈ దఫా కీలకం కానున్నా యి. సమావేశాల ప్రారంభం లోనే దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి శాసనసభ సంతాపం తెలప నుంది. చనిపోయేనాటికి ఆమె కంటోన్మెంట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే కావ డంతో సంప్రదాయాన్ని అనుసరించి మంగళవారంనాటి సమావేశం సంతాప తీర్మానానికే పరిమితమై వాయిదా పడనుంది. తీర్మానం ఆమోదం పొందిన వెంటనే స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ సభను బుధవా రానికి వాయిదా వేస్తారు.

ఇక స్కిల్‌ యూనివర్సిటీ, విద్య కమిషన్‌, వ్యవసాయ కమిషన్‌, స్థానిక సంస్థల (Skill University, Education Commission, Agriculture Commission, Local Body)ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యంగా తీసుకున్న ఈ బిల్లులన్నీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు పెట్టేందుకు ప్రభుత్వం రంగం చేసుకుంది. పూర్తిస్థాయి బడ్జెట్‌తో పాటు వీటిని కూడా సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నా రు. వీటితోపాటు జాబ్‌ క్యాలెండర్‌, రైతు భరోసా విధి విధానాలపైనా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన చేయను న్నారు. ఈ క్రమంలోనే మంగళ వారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు సంబందించి ఆయ శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలి అనే తదితర అంశాలపై ఇందులో నిర్ణయాలు తీసుకోనున్నా రు. ఈ సమావేశాలు పది రోజులపా టు కొనసాగే అవకాశాలు ఉన్నాయ ని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలు స్తోంది. గత ఏడాది డిసెంబరులో కొలువుదీరిన రేవంత్‌ రెడ్డి (revanth reddy) ప్రభు త్వం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను గత స మావేశాల్లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలు ముగి సి మోదీ(modi) సర్కారు కూడా పూర్తిస్థా యి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేం దుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌తోపాటు పలు కీలక బిల్లులకూ ఆమోదం పొంద నుంది. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో జరగనున్న బడ్జెట్‌ సమా వేశాలు వాడీ, వేడిగా జరిగేందుకు ఆస్కారం ఉంది. ఖైరతాబాద్‌ ఎమ్మె ల్యే దానం నాగేందర్‌ మొదలుకుని పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహి పాల్‌ రెడ్డి వరకు పది మంది బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు దశలవారీగా కాంగ్రె స్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో వారి చేరిక తర్వాత జరు గుతున్న మొదటి సమావేశాలు కావడం గమనార్హం. ఫిరాయింపుల కు సంబంధించి అధికార పార్టీపై శాసనసభ వేదికగా మాటల దాడికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. అలాగే, రైతు బంధు, రుణ మాఫీ, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశా లపైనా సర్కారును నిలదీయాలని భావిస్తోంది. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారిని బీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకు న్న అంశాన్ని లేవనెత్తి ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్‌ సమాయత్తమ వుతోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నా యంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ సైతం వివిధ అంశాలపై ప్రభు త్వాన్ని నిలదీసేందుకు శాసనసభ ను వేదికగా చేసుకోవాలని భావి స్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా రైతు రుణమాఫీ (Farmer loan waiver) సహా చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవడానికి అసెంబ్లీని వేదికగా వినియోగించుకోనుంది.