నల్లగొండ జిల్లాలో దారుణం
— స్వార్థం కోసం అన్నను చంపిన తమ్ముడు
ప్రజా దీవెన /నల్లగొండ: ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే అతి దారుణంగా కడతేర్చిన సంఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం లో చోటుచేసుకుంది. అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది.ఆస్తి తగాదాల నేపథ్యంలో జడ కోటేశ్వరావు (40) అనే వ్యక్తి దారుణ హత్య గురయ్యారు. అశాశ్వతమైన ఆస్తికోసం అన్న కోటేశ్వరావును తమ్ముడు కాశి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపిన ఉదంతం సమాజమే ముక్కునవేలేసుకునే విధంగా చేసింది. సంఘటనకు సంబంధించి ఘటనాస్థలికి చేరుకున్న పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.