హైదరాబాద్ శివారులో దారుణం
— మైలార్దేవుపల్లిలో బాలుని హత్య
ప్రజా దీవెన /రంగారెడ్డి: హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని మైలార్దేవుపల్లిలో 17 సంవత్సరాల వయసు కలిగిన బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు.
ఈ అమానవీయ ఘటన మైలార్‌దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతుడు బిహార్‌కు చెందిన రాజా పాశ్వాన్‌గా గుర్తించగా రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన వారితో పాశ్వాన్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గొడవపడిన వారే చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.