— మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న పిడి శేఖర్ రెడ్డి
Award Presented :ప్రజాదీవెన నల్గొండ :2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజీలో కేటాయించిన లక్ష్య సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా
హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో డిఆర్డిఓ, అడిషనల్ డిఆర్డిఓ, డిపిఎం, జిల్లా సమాఖ్య అధ్యక్షులు ఉత్తమ పనితీరు అవార్డును స్వీకరించారు. రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల ఏపిఎంలకు, సీసీలకు, గ్రామ సమాఖ్య, మండల సమాఖ్య లు అందరికీ డిఆర్డిఓ కృతజ్ఞతలు తెలిపారు.