Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

B.R.Y.S.V: బి.ఆర్.యస్.వి నేతలపై లాఠీ ఛార్జ్ అమానుషం

–తక్షణమే డి.యస్.సి, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలి
–బి.ఆర్.యస్.వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయీన నాగార్జున ముదిరాజ్

B.R.Y.S.V:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో (telangana)ప్రజా పరిపాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (congress) రేవంత్ రెడ్డి (revanth reddy)సర్కారు దగా పాలన,నిర్భంద పాలన ముళ్ళ కంచెలతో పరిపాల న కొనసాగిస్తూ నిరుద్యోగు లపైన మరియు విద్యార్థి నాయకుల (Student leaders)పైన ఉక్కుపాదం మేపుతూ విద్యార్దుల ను అనిచేవెస్తున్నరని బిఆర్యస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబో యీన నాగార్జున ముదిరాజ్ ఆరోపించారు.

స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని యన్.జీ కళాశాల ప్రాగణo ముందు ఏర్పాటు చేసిన నిరుద్యోగుల విలేకరుల సమావే శంలో బి.ఆర్.యస్.వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయీన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ మరి ముఖ్యంగా గత రెండు నెల లుగా నిరుద్యోగ యువత విద్యార్థులు (Unemployed youth students) న్యాయమైన కొరికలైన గ్రూప్2, డి.యస్.సి మరియు గ్రూప్ 3 పోస్టులను పెంచి పరీక్షలను వాయిదా వేయాలని మరియు గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలలో 1:100 పిలవాలని డిమాండ్ చేస్తూ విద్యా ర్థులు ఆందోళన కార్యక్ర మాలు చేస్తుంటే వారికి మద్దతుగా బి.ఆర్. యస్ పార్టీ విద్యార్థి విభాగం పూర్తి గా అండగా ఉంటూ నిన్న ఉస్మా నియా యూనివర్సిటీ (Osmania University)లో నిరు ద్యోగులతో కలిసి బి.ఆర్.యస్.వి నాయకులు ఆందోళనతో చేపట్టు తుండగా వారిపై విధి రౌడిలలగా నా నా భూతులు తిడుతూ, లాఠీ చార్జి చేసి,అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికై నా రేవంత్ రెడ్డి గారు స్పందించి నిరు ద్యోగులకు క్షమాపణ చెప్పి పరీ క్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో బిఆర్ ఏస్ వి జిల్లా నాయ కులు నోముల క్రాంతి యాదవ్, కార్తిక్,శివ కుమార్, సైదులు, వెంక ట స్వామి,ఉదయ్, వెంక ట్,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.