*సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలి
బక్రీద్ సందర్భంగా ఈద్గా లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
*స్థోమత ఉన్న ప్రతి ముస్లిం దానధర్మాల కోసం త్యాగం చేయాలి …. మౌలానా అబ్దుల్ ఖాద్రర్ రాషాదీ
Bakrid ప్రజా దీవెన, కోదాడ: త్యాగానికి ప్రతీక బక్రీద్ (Bakrid) పర్వదినం అని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదర్ రషాదీ (Maulana Abdul Qader Rashadi) అన్నారు. సోమవారం బక్రీద్ పర్వదినం సందర్భంగా పట్టణ పరిధిలోని సాలార్జంగ్ పేట ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన ఆధ్యాత్మిక భావాలను ప్రబోధించారు. మత గ్రంథం ఖురాను అనుసరించి స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన సంపదలో కొంత భాగాన్ని త్యాగం చేయాలన్నారు. దైవాజ్ఞను శిరసావాహించడానికి ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం సలే అల్లాహు సల్లెం కన్న కొడుకును బలి చేయడానికి సిద్ధమయ్యారని ఆ త్యాగానికి దైవం ప్రసన్నతవచ్చేంది ఆకాశము నుండి గొర్రె పొట్టేలును భూమి పైకి కుర్బానీ ఇవ్వమని పంపించారని పండుగ (festival)చరిత్రను వివరించారు.
ఇస్లాం సిద్ధాంతం ప్రకారం సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలన్నారు ప్రార్థన నల (prayers) అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఒకరికొకరు ఆ లింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు బక్రీద్ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పలు పార్టీల రాజకీయ నాయకులు అధికారులు ముస్లిం సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఈ ప్రార్థనలో స్థానిక కౌన్సిలర్ షేక్ మదర్ సాహెబ్ మత పెద్దలు మౌలానా మహమ్మద్ అహ్మద్ నద్వి (Maulana Abdul Qader Rashadi), ముస్లిం మైనార్టీ నాయకులు భాజాన్, ఖాజా మైనుద్దీన్ బాగ్దాద్, బాబా, అలీ భాయ్, ముస్తఫా మజహార్ సయ్యద్ బాబా, గ్రంధాలయ చైర్మన్ రహీం తదితరులు పాల్గొన్నారు….