Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Balu Naik: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం

–వరద బాధితులను నేరుగా కలి సి భరోసా కల్పించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

Balu Naik: ప్రజా దీవెన, దేవరకొండ :వరద బాధితులను (Flood victims) నేరుగా కలిసి ప్రభు త్వం అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ భరోసా కల్పిం చారు. నల్లగొండ జిల్లా డిండి మం డల పరిధిలోని గోనబోయిన పల్లి గ్రామానికి చెందిన పలువురు చేప లు పట్టటానికి వెళ్లి సిద్దాపూర్ శివా రులోని రాతి బండపై ఉంటున్న చిన్నపిల్లలతో సహా 10 మంది చెం చులు వరద మధ్యలో చిక్కుకున్న విషయం తెలుసుకొని వారి క్షేమ స మాచారాన్ని ఎప్పటిక ప్పుడు పర్య వేక్షిస్తూ వాగులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు స్వ యంగా రంగంలోకి దిగి, గజ ఈత గాళ్ల సహాయంతో వాగులో చిక్కు కున్న వారిని రక్షించేందుకు మం గళవారం ఉదయం 7 గంటలకు సిద్దాపురం సమీపంలోని డిండి వాగు వద్దకు చేరుకొని వరద బాధి తులను నేరుగా కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని సహచార ఎమ్మెల్యే వంశీ కృష్ణతో (Vamsi Krishna)కలిసి భరో సా కల్పించారు. దేవరకొండ ఎమ్మె ల్యే నేనావత్ బాలు నాయక్ భారీ వర్షాలు, వరదల కారణంగా మర ణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశా రు.

వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఆదేశించారు అని అన్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి, బాధితులను ఆదుకోవాలి అని అన్నారు.

గత మూడు రోజులుగా భారీ వర్షాలతో (With heavy rains) అతలాకుతలమై ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. పేదలను ఆదుకోవడంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వర్ రావు, డిండి మాజీ సర్పంచ్ శైలేష్, గడ్డామిది సాయి, మేకల కాసన్న, బద్దెల శ్రీను, శ్రీనివాస్ గౌడ్, సాయి బాబా, ఖలీమ్, పోలీస్ శాఖ యంత్రాంగం, రెవెన్యూ శాఖ యంత్రాంగం, అచ్చంపేట పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు నాయకులు, వివిధ అనుబంధ సంఘాల, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.