Bandaru Bikshamayya : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు బిక్షమయ్య మృతి బాధాకరమని సిపిఐ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు బండారు బిక్షమయ్య గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తన నివాస గృహములో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం భిక్షమయ్య గృహా నికి వెళ్లి పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారని గ్రామ శాఖ పార్టీ ఏ పిలుపు ఇచ్చినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనే విజయవంతం చేసేవాడని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ కార్యదర్శి మాతంగి ప్రసాదు, ఏఐటీయూసీ ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ, కొండ కోటేశ్వరరావు, నిడిగొండ రామకృష్ణ, బత్తి నేని హరిప్రసాద్ బత్తినేని వెంకటగిరి, ఖాజామియా డాక్టర్ రామా రావు,కుమారుడు బండారు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.