Bandaru Prasad : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : బిజెపి జిల్లా కన్వీనర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ గత కార్యకర్తగా, నాయకుడిగా నల్గొండ జిల్లాలో ఎదగటం మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య జరిగిన సంఘటనలో మీ అందరూ చూస్తురు కేంద్ర పార్టీ నియమ, నిబంధనలు తుంగలో తొక్కి రాష్ట్ర పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించటం పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం దాని పున పరిశీలించాలని చేయాలని మేమందరం ముక్తకంఠంతో కోరుతున్నాం.
ముఖ్యంగా ప్రతి మండలము సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం అప్పుడు రెండోసారి సభ్యత్వం అప్పుడు పార్టీ సభ్యత్వం మండల అధ్యక్షుడుగా ఉంటుంది. జిల్లా కమిటీ గా అవకాశం ఉంటుంది, కేంద్ర పార్టీ సూచన మేరకే కానీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నియామకం అతను ఎప్పటినుంచి ఉన్నాడు. అతనకు ఎప్పుడు సాధన సభ్యత్వం లేదు, ఈసారి క్రియాశీల సభ్యత్వం రాలేదు అప్లై చేసుకోవడం జరిగింది .
రెండుసార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే అధ్యక్షుడుగా ఇవ్వటం జరుగుతుంది కానీ మోసం చేసి, మేనేజ్ చేసి ఈ పదవి తెచ్చుకున్నాడు దీనికి నల్గొండ బీజేపీ కార్యకర్తలు ఎవరో జీర్ణించుకోలేకుండా ఉన్నారు. గత 11 నెలలుగా అతని గురించి చేసిన పనులు అందరం గమనిస్తున్నాం, పేమెంట్ వర్కర్లు పెట్టుకొని నిజమైన కార్యకర్తలని అవమానించినట్టుగా చులకనగా చేస్తు కార్యక్రమాలు ఉన్నాయి. నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ నాయకులకు ఎలా చెప్పాలో,కార్యకర్తలకు ఏ విధంగా చెప్తాడు అన్ని హంబకు మాటలు చెపుతూ వ్యక్తుల్ని మోసం చేసే వారిని చూసాం గానే నాయకుల్ని,పార్టీని మోసం చేసే పదవి తెచ్చుకోవటం జరిగింది.
మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం,పార్లమెంట్ ఎన్నికల్లో నిధులు ఏ విధంగా దుర్వినియోగం దుర్వినియోగం చేశాడో అందరకి తెలుసు,బిజెపి ఆఫీసులో ఏనాడు ఒక పేపర్ కూడా ఉండదు అందుబాటులో కూడా ఉండదు, ఒక జిల్లా అధ్యక్షుడు అయ్యుండి పార్టీ ఆఫీసుకి కరెంటు బిల్లు కూడా కట్టలేని దుస్థితి,అతను చేసింది ఏమీ లేదు నాయకత్వం మార్చే వరకు మేము ఎవరో బిజెపి పార్టీకి ఆఫీసుకు పోమని పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పోతే పాక సాంబయ్య, జిల్లా ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు ముని కుమార్, మాజీ కౌన్సెలర్స్ బొజ్జనగరాజు, రవిరాళావెంకట్, దాసరి సాయి, కంకణాల నాగిరెడ్డి,వొంగురు రాజు, గడ్డం వెంకటరెడ్డి, దాయం భూపాల్ రెడ్డి తదితరులు ఫాల్గున్నారు.