— తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విశ్వహిం దూ పరిషత్ క్షేత్ర ప్రముఖ్ బండారు రమేష్
— చైనా, రష్యా దేశాలకు కమ్యూని స్టులు తొత్తులుగా మారారు
–కులాల వారిగా విభజించి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న రాజకీయ నేతలు
–బంగ్లాదేశ్ లో హిందువులపై జరు గుతున్న అఘాయిత్యాలపై ఆగ్ర హం
Bandaru Ramesh: ప్రజా దీవెన, షాద్ నగర్: ప్రపంచం లోని యాభైరెండు మైనార్టీ దేశాల లో ఎక్కడా లేని కమ్యూనిస్టులు కేవలం భారతదేశంలో ఉంటూ, హిందూ ధర్మాన్ని (Hindu religion) విచ్ఛిన్నం చేసేం దుకు కుట్రలు చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర ప్రముఖ్ బండారు రమేష్ తీవ్రంగా విమర్శించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అవమానియా ఘటనలపై విశ్వ హిందూ పరిషత్ (Vishwa Hindu Parishad)స్పందించింది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా ఆం దోళన నిర్వహించారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై (Hindu in Bangladesh) జరుగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ, హిందు వాహిని, బజరంగ్ దళ్, ఏబీవీపీ తదితర విభాగాల నాయకులు, ప్రజలు సైతం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు రమేష్, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, చెట్ల వెంకటేష్ తదితర నేతలు ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించారు. అనంతరం మీడియాతో రెండు తెలుగు రాష్ట్రాల విశ్వహిందూ పరిషత్ క్షేత్ర ప్రముఖ్ బండారు రమేష్ (Bandaru Ramesh)మాట్లా డుతూ హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు కొన్ని దేశాలు నిధులను కూడా సమకూ ర్చుతున్నాయని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇందులో భాగంగా కమ్యూనిస్టులు చైనా, రష్యా దేశాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మైనార్టీ దేశాలలో ఎక్కడ కమ్యూనిజం లేదని కేవలం భారతదేశంలో కమ్యూనిస్టులు ఉంటూ దేశంలో హిందూ వాదాన్ని అణచివేసే విధంగా కుట్ర పన్నుతున్నారని, వారిని స్వదేశీ దుర్మార్గులుగా బండారు రమేష్ అభివర్ణించారు. ఇంట్లో ఉన్న గడప దాటిన హిందూ ధర్మాన్ని రక్షించుకునే విధంగానే అందరు ఎకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని స్వయంగా రక్షించుకోకపోతే ప్రమాదం పొంచి ఉందని బండారు రమేష్ హెచ్చరించారు.
ఇస్లామిక్ తీవ్రవాదులారా ఖబర్దార్ – నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
ప్రపంచంలోని ఇస్లామిక్ తీవ్రవాదులరా ఖబర్దార్ మీ ఆటలు ఇక చెల్లవు అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలకు స్వేచ్ఛ జీవితాలను ప్రసాదించిన హిందువులపై కత్తిగట్టిన ఇస్లామిక్ తీవ్రవాదుల చర్యలను బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. బంగ్లాదేశ్ ఘటనపై ముస్లిం సంస్థలు ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 20 శాతం ఉన్న ముస్లింలు ఈ దారుణాలను కూడా ఖండించాలని సూచించారు. తాము హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ, ఇతర మతాలను ఎంతో గౌరవిస్తున్నామని మరి తమలాంటి వారిపై విదేశాల్లో ఎందుకు దాడులు జరుగుతున్నాయని శ్రీ వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ఘటనలపై ప్రపంచవ్యాప్తంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
దుర్మార్గమైన చర్య – అందే బాబాయ్య
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు దుర్మార్గమైన చర్యలని బిజెపి (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య విమర్శించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా జరుగుతున్న బంగ్లాదేశ్ లో దాడులపర్వం పై హిందూ లోకం ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. కనీసం పాపబీతి కూడా లేకుండా మహిళలపై, చిన్న పిల్లలపై (On women, on small children) దుర్మార్గంగా తెగబడుతున్న దారుణాలు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందని అన్నారు. ఇలాంటి దాడులను అడ్డుకోకపోతే దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయని అందరూ ముక్తకంఠంతో ఇలాంటి దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెట్ల వెంకటేష్ మల్చాల మురళి వంశీ భూషణ్ మఠం రిషికేష్ పుట్నాల సాయి తదితరులు పాల్గొన్నారు..