–వారికిచ్చిన హామీల అమలు మా ట ఏమైనట్లు
–తక్షణమే వారికిచ్చిన హామీలను అమలు చేయాలి
–సంజయ్ కు వినతి పత్రం సమ ర్పించిన ఆశావర్కర్లు
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Bandi Sanjay: ప్రజా దీవెన, మానకొండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కోరారు. దీం తో పాటు ఆశావర్కర్ల సమ స్యలపై కాంగ్రెస్ ఎన్నికల మేనిఫె స్టోలో ఇచ్చి న హామీలను సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆది వారం మానకొండూరు నియోజక వర్గంలోని తిమ్మాపూర్ లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బండి సంజయ్ హాజరప రయ్యారు. ఈ సందర్భం గా తెలంగాణ ఆశావ ర్కర్స్ యూ నియన్ ఆధ్వర్యంలో పలువురు ఆశావర్కర్లు బండి సంజయ్ (Bandi Sanjay) ను కలిసి తమ సమస్యల పరిష్కరించే లా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని కోరుతూ వినతి పత్రం అందజే శారు.
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఆ శావర్కర్లు కనీస వేతనాన్ని రూ.18 వేలు చేయాలని, పెండింగ్ పీఆర్సీ ఎరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ (Pending PRC arrears, Corona Risk Allowance)ఇవ్వాలని 15 రోజులు సమ్మె చేస్తే దిగొచ్చిన ప్రభుత్వం పలు హామీలి చ్చిందన్నారు. చివరకు సమ్మె కాల పు వేతనం చెల్లింపు మినహా ఇతర హామీలేవీ నేటికీ అమలు కాలేదని వాపోయారు. ఈ అంశంపై ఎన్నిసా ర్లు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమా ర్ ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. దీంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో (Congress Manifesto) ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధి తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.