Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: అంతా గాడిదగుడ్డేనా..!

–అది రాష్ట్ర బడ్జెట్టా లేక అప్పుల పత్రమా
— కేంద్ర మంత్రి బండి సంజయ్‌

Bandi Sanjay: ప్రజా దీవెన, హైదరాబాద్: డిప్యూ టీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమా ర్క (Deputy Chief Minister, Finance Minister Bhatti Vikram) శాసనసభలో ప్రవేశపెట్టింది ఆర్థిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. ప్రజలకు అదేదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌+రాష్ట్ర బడ్జెట్‌ =గాడిద గుడ్డేనా అంటూ వ్యాఖ్యా నించారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్‌ హామీలను అమలు చేయడం అంతే నిజమం టూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యో గాలు భర్తీ చేశామనడం నిరుద్యోగు లను మోసగించడమే అని అన్నా రు.

రూ.లక్షన్నర కోట్లతో మూసీ రివర్‌ ఫ్రంట్‌ (Musi Riverfront) చేపడతామని చెప్పి పైసా కేటాయించలేదు. రంజాన్‌ వేడుకలకు రూ.33కోట్లు కేటాయిం చి హిందువుల పండుగలకు పైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఏం సంబం ధమో ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్‌ (BJLP Deputy Leader Payala Shankar) డిమాండ్‌ (demand)చేశారు. మహిళా సంఘాలు ఆయా బ్యాం కుల నుంచి రూ.లక్ష కోట్ల రుణం తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లిం చాయని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సాయంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.