Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: వారిద్దరూ అవ‌కాశవాదులు

–కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి బండి

Bandi Sanjay:ప్రజా దీవెన,హైద‌రాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శిం చారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుం దన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న శనివారం ఎక్స్ లో ట్విట్ చేశారు.ఇక తెలంగాణ బ‌డ్జెట్ పై అంశాన్ని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలన్నీ గాడిద గుడ్డే అని సంబోధించారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలూ కూడా గాడిద గుడ్డే అని వ్యాఖ్యానించారు.

నీతి అయోగ్ (Ethics Aayog)సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకాకపోవడం దుర్మార్గమ న్నారు. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబం ధాల బలోపేతమే లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం జరుగుతుం దన్నారు.ఈ రెండు అవ‌కాశ‌వాద పార్టీలే అని అంటూ కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలు అని విమర్శించారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోస్యం చెప్పా రు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress on Kaleswaram, BRS) కలిసి డ్రామాలు ఆడుతున్నాయ న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమ ర్శించారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమ ర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుంద న్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇక అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ (brs) విలీనం అవడం ఖాయ మని జోస్యం చెప్పారు.