Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా

–దేశం కోసం తనకుండే అధికారా న్ని ఉపయోగిస్తా
–కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay: ప్రజా దీవెన,కరీంనగర్: కరీంగనగర్ ప్రజలు పెట్టిన భిక్షతోనే తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చిందని బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి ఆయన తన సొంతగడ్డ కరీంనగర్ (Karimnagar)కు వచ్చారు. ఈ సందర్భంగా కరీం నగర్ (Karimnagar) నేలకు సాష్టంగప్రణామం చేసి న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కృషితోనే తాను కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి (Union Minister) వరకు ఎదిగానని చెప్పారు. కేసీఆర్ మూర్ఖపు పాలన పై పోరాడిన వారు తనతోపాటు కొంతమంది లాఠీ దెబ్బలు తిన్నార ని గుర్తు చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో 155 రోజులు పాదయాత్ర చేసి 1600 కి.మీలు తిరిగితే.. నా అడుగులో అడుగు వేసి కార్యకర్తలు నడిచినందునే ఈ పదవి వచ్చింది. అందుకే ఈ పదవి కార్యకర్తలకే అంకితం. కార్యకర్తలు నా పక్షాన ఉండకుం లాఠీదెబ్బలు తినకుంటే, జైలుకు (jail) వెళ్లకుంటే నాకు ఈ గుర్తింపు వచ్చేది కాదన్నారు. కేంద్ర మంత్రి పదవి అధికారం కోసమో, పదవులు అనుభవించడా నికో అక్రమంగా సంపాదించుకోవ డానికో కాదు, దేశ రక్షణ, ధర్మ రక్ష ణ, సమాజ సంఘటితం కోసం తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తా. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం ఈ పదవిని ఉప యోగిస్తానని బండి సంజయ్ అన్నా రు. ఎన్నికల వరకే రాజ కీయాలు ఎన్నికల తరువాత పూర్తిగా తెలం గాణ అభివృద్ధి, కరీంనగర్ (Karimnagar) అభి వృద్ధి కోసమే పనిచేస్తానని అన్నా రు. రేపు కిషన్ రెడ్డి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుండి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళుతున్నా, సెల్యూట్ తెలంగాణ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమా నికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని కోరుతున్నా అని బండి సంజయ్ (Bandi Sanjay అన్నారు.