Baptist Church: ప్రజా దీవెన, కోదాడ:కోదాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు (floods)వలన సంభవించిన వరదలు కారణంగా నష్టపోయిన కుటుంబాల కొరకు ఆదివారం పట్టణంలోని స్థానిక బాప్టిస్ట్ చర్చ్ (Baptist Church) పాస్టర్ రెవరెండ్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా కోదాడ పెద్ద చెరువు నిండి అలుగుపారటంతో కోదాడ అనంతగిరి రాకపోకలు నిలిచిపోయాయని దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు కోదాడ పెద్ద చెరువు (Kodada is a big pond) లోదట్టు ప్రాంతం మొత్తం నీటిమయం కావడంతో ఇళ్లల్లో నీళ్లు నిలిచి సామాన్లు తడిచిపోయి రాత్రి నిద్ర లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు ముఖ్యంగా కోదాడ పట్టణం లోతట్టు ప్రాంతాల్లో నీటిమయం కావడంతో ప్రజలు ఇళ్లల్లోకి నీళ్లు పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మున్సిపల్ అధికారులు సిబ్బంది పోలీస్ శాఖ వారు రెవిన్యూ శాఖ (The police department, revenue department)ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించి సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రార్థనలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు వంటి పాక జానకి యేసయ్య టీచర్స్ యూనియన్ నాయకులు బొల్లికొండ కోటయ్య, జగ్గు నాయక్ మోసెస్ విజయానంద్ రాంబాబు శ్యాంబాబు మోనికా భాగ్యశీ అరుణ ద్రాకక్షవల్లి తదితరులు పాల్గొన్నారు