Bathukamma Celebrations: ప్రజా దీవెన, కోదాడ: పురపాలక సంఘం పరిధిలోని నాలుగో వార్డ్ తమ్మర పాత కాలనీలో బచ్చలకూర ప్రతిభ, చైతన్య, కల్పన ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ వేడుక (Bahujan Bathukamma celebration)లను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆటపాటలతో బహుజన నాయకుల త్యాగాలను స్మరించుకున్నారు.
బహుజన బతకమ్మ వేడుకలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar), జ్యోతిరావు పూలే జాషువా (Jyoti Rao Phoole Joshua) చిత్రపటాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సిద్దెల నాగమణి, సిద్ధల రాంబాయి, బంక కరుణ ,గొర్రె పుష్పమ్మ, క్రితిక, నిధికా సిద్ధల నాగమణి ,ఆల్లూరు భారతమ్మ ,రంగమ్మ ,కొంగల లక్ష్మి, భవిత ,త్రి క్షణ ,శరణ్య తన్వి, సేవిత, కృష్ణప్రియ, ఝాన్సీ, దేవి యశస్విని, చిన్నం నాగమణి , వంగూరి లక్ష్మి, నీలమ్మ, నాశరమ్మ, చిన్నారులు, మహిళలు, యూత్ పిల్లలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.