Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bathukamma Celebrations: కిట్స్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Bathukamma Celebrations: ప్రజా దీవెన, కోదాడ: స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో (Kitts College of Engineering for Women)శనివారం బతుకమ్మ సంబురాలు (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు ఈ బతుకమ్మ ఉత్సవాలలోఅమ్మవారి తొమ్మిది అవతారాలను విద్యార్థినులు ధరించి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విద్యార్థినులు స్వయంగా బతుకమ్మ లను పేర్చడం, తెలంగాణ సంస్కృతి కి నిదర్శనం అని,ఈ బతుకమ్మ సంబురాలలో పాల్గొన్న విద్యార్థినులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ (Neela Satyanarayana) చరవాణి ద్వారా అభినందించడం జరిగింది. బతుకమ్మ (Bathukamma) ఆట -పాట లతో కళాశాల ప్రాంగణం మర్మోగినది.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ, మహిళలు స్రవంతి,లక్ష్మి, సరిత, హిమబిందు, లావణ్య, ప్రత్యుష,జ్యోతి, ప్రియాంక, రమ్య, ఝాన్సీ, సుప్రియ, మమత, శ్రీవిద్య విద్యార్థులు పాల్గొనారు