Bathukamma celebrations: ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ లో కె.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ( KRR Govt Degree College)చదువుల బతుకమ్మ సంబరాలు (Bathukamma celebrations)కళాశాల ప్రిన్సిపాల్ డా.చందా అప్పారావు గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, మున్సిపల్ కమిషనర్ రమా దేవి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా ప్రమీల (Pramila) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము.మన చదువులతో పాటు మనం మన సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను తెలుసుకొని ప్రతి ఒక్కరం గౌరవించాలని తెలిపారు. పువ్వులను పూజించే సంస్కృతి culture)మన తెలంగాణ సంస్కృతి అని కొనియాడారు ఆడబిడ్డలు అందరూ ఎంతో సంతోషంగా ఈ పది రోజులు బతుకమ్మను గౌరవంగా పూజిస్తూ సాగనంపుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ,ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.