Osmania University : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆల్ బ్యాక్ వర్డ్ క్యాస్టేస్ జేఏసీ (ఎబిసి జేఏసీ) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం జరగనున్న బీసీ హక్కుల బోనం పో స్టర్‌ను ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమం లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవ స్థాపకులు రిటైర్డ్ ఐఎస్ చిరం జీవులు, ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్, ప్రొఫెసర్ పరంధాములు హజర య్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికార సాధనే ధ్యే యంగా నిరంతరం బీసీలు ఉద్యమించాలన్నారు. వి ద్యార్థులుగా ఇటువంటి సాంస్కృతిక ఉద్యమాలతో ప్రజలను పోరా టాలలో భాగస్వామ్యం చేస్తూ వారికి జరుగుతున్న అన్యాన్ని వివ రించడం మంచి పరిణామమన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్య మానికి యూనివర్సిటీలు,విద్యర్థులే కేంద్రం అవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి, మండ్ల రవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొ మ్మనబోయిన సైదులు యాదవ్, ఎబిసి జేఏసీ నాయకులు నూకల మధు యాదవ్, అశ్వ ణ్, శ్రీధర్ యా దవ్,మహేష్ గౌడ్,ప్రసన్న,పగిళ్ళ ప్రశాంత్,నర్మద, కృష్ణ,సంతోష్,శ్రీనివాస్, శ్రీకాంత్,చిందం మధు, శివ, బొబ్బిలి మహే ష్ తదితరులు పాల్గోన్నారు.