— బిసి కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి
BC Commission Balalakshmi : ప్రజాదీవెన నల్గొండ :మార్పునకు పూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని తెలంగాణ బిసి కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజుల మహనీయుల జయంతి ఉత్సవాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి స్ఫూర్తిని ప్రతిబింభిచేలా వివిధ కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఉదయం 6 గంటలకు నల్లగొండ పట్టణంలోని గడియారం కూడలి లోని ఫూలే విగ్రహానికి నివాళ్ళు అర్పించి అనంతరం సమ్మీళిత సమాజం శీర్షికతో చైత్యన పరుగును మర్రిగూడ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిచారు.
ర్యాలీని ఉప కులపతి, ఆర్డివో అశోక్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య అలువాలా రవి ప్రారంభించారు. అనంతరం విశ్వావిద్యాలయం లో నిర్వహించిన ఉత్సవానికి తెలంగాణ బిసి కమిషన్ సభ్యురాలు ఆర్ బాలలక్ష్మి విశిష్ట అతిధిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రశాంగించారు. మార్పునకు పూలే దంపతులు చేసిన కృషిని, సామాజిక సేవ, విద్య వ్యాప్తి, లింగ వివక్ష పై పోరు, బలమైన తాత్విక చింతనకు స్థాపించిన సత్యశోధక్ సమాజ్ పూర్తిని వివరించారు. సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం, మహిళా ఉద్యమకారునిగా ఎదుర్కొన్న వివక్షలను అధిగమించేందుకు పూలే, అంబేడ్కర్ల స్ఫూర్తిని విద్యార్థులతో పంచుకున్నారు. నేటికీ మహిళలపై జరుగుతున్న అణిచివేతలపై, జీవన విధానం, ఆహారపు అలవాట్లు పై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కేవలం విద్య మాత్రమే పరిపూర్ణమైన మార్పుకు సాధనంగా మహనీయుల జీవితాలు సాక్ష్యంగా నిలుచున్నాయన్నారు.
అనంతరం ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ పరిపూర్ణమైన మార్పునకు పూలే బలమైన తాత్విక పునాది అని కీర్తించారు. విద్య విశ్వ మానవులుగా మలచడం ప్రపంచాన్ని మరింత మానవీకరించి సమసమాజ స్థాపనకు అన్న సత్యాన్ని ఫూలే జీవితం ఒక సాక్ష్యంగా గుర్తించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వకృత్వ, వ్యాసరచన, నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ కోట కరుణాకర్, ఉత్సవాల చైర్మన్ ఆచార్య అంజిరెడ్డి కన్వీనర్ డా. శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. మద్దిలేటి, కళాశాలల ప్రిన్సిపాల్ డా. కె. ప్రేమ్ సాగర్, అరుణప్రియ, సుధారాణి, ఇంటర్నల్ కమిటీ చైర్ పర్సన్ ఆచార్య వసంత, ఆచార్య సరిత, ఆచార్య శ్రీలక్ష్మి, దోమల రమేష్, మిరియాల రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.