–రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Minister Ponnam Prabhakar Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: పంచా యతీరాజ్ చట్టం-2018 ప్రకారం రా ష్ట్రంలోని స్థానిక సంస్థల్లో 42% రిజ ర్వేషన్లు అమలు చేయబోతున్నా మని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లు పై శాసన సభ లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొ చ్చే రై ట్ ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్డినెన్స్ కు అసెంబ్లీకి సంబంధం లే దని అన్నారు. బీజేపీ ఎంపీ, ఓబీసీ నేత లక్ష్మణ్ కు ఉన్న అనుమానా లేంటని ప్రశ్నించారు.సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడి యా తో మాట్లాడారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును రా ష్ట్రపతి ఆమోదం చేపించి 9వ షె డ్యూల్ లో పెట్టించాలన్నారు. బీజే పీ బీసీల పార్టీ కాదని, బండి సం జయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొల గించి కిషన్ రెడ్డికి అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రిజ ర్వేషన్లకు ఎవరైనా అడ్డు పడితే కా పాడుకునే బాధ్యత బీసీ మేధావు లు, నేతలదని అన్నారు. బీసీబిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి మంత్రివ ర్గా న్ని, అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి గతం లోనే చెప్పారని గుర్తు చేశారు.
రిజర్వేషన్లు కాపాడుకునేందుకు కుల సంఘాలన్నీ ఒక్కటయ్యాయ ని అన్నారు. బలహీన వర్గాల కోస మే కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీ సుకుందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని న్యాయస్థానం చె ప్పిందన్నారు. తెలంగాణ ప్రజల ఆ కాంక్షల మేరకు ప్రవేశ పెట్టిన బిల్లు ను గవర్నర్ ఆమోదించిన బీసీ బి ల్లును రాష్ట్ర పతి ఆమోదించాలని రిక్వెస్ట్ చేస్తున్నామని పొన్నం అన్నా రు. తీన్మార్ మల్లన్నపై దాడి అంశా న్ని మీడియా ప్రస్తావించగా మహి ళల పట్ల మల్లన్న వ్యాఖ్యలు తప్ప ని అన్నారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడిని కూ డా మంత్రి ఈ సందర్భంగా తప్పుప ట్టారు.