Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Welfare Department : జీతాలు ఇప్పించాలని ధర్నా

BC Welfare Department :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇప్పించాలని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా బీసీ సంక్షేమ శాఖ హాస్టలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు లేక వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తారున్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒంగోలు సునీల్, హాస్టల్ వర్కర్స్ సిబ్బంది లొడంగి యాదమ్మ, అలివేలు, నకరికంటి లక్ష్మమ్మ, లక్ష్మీకాంతమ్మ, శివశంకర్,
రవి నాయక్, హంసమ్మ,
జి. యాదమ్మ, దేవయ్య, రేణుక, దేవయ్య, పద్మ, అనిల, సురేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.