— నేటి పోరాట ఫలితమే అధికారిక తెలంగాణ పరిపాలన దినోత్సవం ప్రకటన: బెజవాడ వెంకటేశ్వర్లు
Bejawada Venkateswarlu: ప్రజా దీవెన, కోదాడ: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే తెలంగాణ విముక్తి అని సూర్యాపేట జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు (Bejawada Venkateswarlu) అన్నారు. గురువారం తెలంగాణ (telangana) 76 వ వార్షికోత్సవాల సందర్భంగా కోదాడ పట్టణానికి చేరుకున్న వార్షికోత్సవ జాతకు కొమరబండ వై జంక్షన్ (Komarabanda Y Junction) వద్ద జిల్లా కమిటీ కోదాడ మండల పట్టణ కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో స్వాగతం పలికి మోటార్ సైకిల్ ర్యాలీని, కొమరబండ సాలార్జంగ్ పేట రంగా థియేటర్ మీదుగా బస్టాండ్ సెంటర్ ఖమ్మం క్రాస్ రోడ్ తమ్మర బండపాలెం కంతం రాఘవయ్య (Kantham Raghavayya) గారి స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడారు. చరిత్రను కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి వారికి అనుకూలంగా మార్చుకున్నాయి. కానీ., భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విముక్త పోరాటమే నిజమైన పోరాటమని తెలిపారు. వేలాదిమంది అసువులు బాసి సాధించుకున్న తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుందని.. అన్యాయానికి పెద్ద పీట వేస్తున్నారని బాంచన్ దొర అని బంధుగులు పట్టి తెలంగాణలో సాగిన పోరాటంలో దోరలు పెత్తందారులు ఘడిలను ధ్వంసం చేసి పేద ప్రజల హక్కుల కోసం సాగిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆయన అన్నారు.
భూమి కోసం భక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో అసువులు బాసిన అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి త్యాగాలను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రకటన చేసి తెలంగాణ ప్రజాపాలనను నిర్వహించుకోవాలని చెప్పడం నాటి పోరాటం వారి త్యాగాలకు నిదర్శనం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, ఎల్లావుల రాములు, దేవర మల్లేశ్వరి, పట్టణ మండల నాయకులు పోతురాజు సత్యనారాయణ, బొల్లు ప్రసాద్, మాతంగి ప్రసాద్, ఎస్కే జానీ ,నాగోల్ మీరా, వెంకటేష్ తిరుపయ్య, బొబ్బులి, తదితరులు పాల్గొన్నారు