Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Belt shops: పుట్టగొడుగుల్లాగా బెల్ట్ షాపులు… మౌనంగా ఎక్సైజ్ అధికారులు..!

**రెండు వైన్స్ లు ..300 పైగా బెల్ట్ షాపులు…

Belt shops: ప్రజా దీవన/ కనగల్: మండలంలోని పల్లెల్లో ఇక్కడ చూసిన బెల్టు షాపులు కిక్కు ఫుల్లుగా కనిపిస్తుంది ఏ గ్రామంలో చూసిన బెల్ట్ షాపులు (Belt shops) పుట్టగొడుగుల నిలుస్తున్నాయి అన్నమతుల లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు తనకీలు చేయవలసిన ఎక్సైజ్ శాఖ అధికారులు ముడుపులు తీసుకొని మౌనంగా ఉంటున్నారని గ్రామీణ ప్రాంతాలలో ( rural areas)ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు కనగల్ మండలంలోని కనగల్, లింగోటం బెల్ట్ షాపులో (Belt shops) జోరుగా సాగుతున్నాయి దీంతో యువత మద్యానికి బానిస అవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

యువత మద్యానికి బానిసై మరణాలకు దిగుతూ నేరస్తులుగా మారి పలు కేసులలో చిక్కుకుంటున్నారు అనుమతులు లేకుండా ఇష్టానుసారుగా బెల్ట్ షాపులలో నిర్వహిస్తున్న కన్నెత్తి ఎక్సైజ్ శాఖ అధికారులు (Kannetti Excise Department officials)చూడకపోవడంతో అంతర్యం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు బెల్ట్ షాప్ (Belt shop)నిర్వహిస్తున్నారని సమాచారం తెలిపిన తు తు మంత్రంగా తనకి లు చేపడుతూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి పల్లె ప్రాంతాలలో ఎక్కడ చేసిన పుట్టగొడుగుల బెల్ట్ షాపులో నిర్మాణం చేపడుతూ ధనార్జననే దేయంగా నిర్వాహకులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా ఒక్కొక్క బెల్ట్ షాప్ నుండి ఎక్సెస్ శాఖలోనే (Excess branch) కొంతమంది అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపుల నిర్వాహకులు స్వయంగా ఆరోపించడం కొసమెరుపు.