Best Education: ప్రభుత్వ బడుల్లో చదువుతూ మట్టిలో మాణిక్యాల్లా రాణిస్తున్నా రు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మట్టిలో మాణిక్యాల్లా రాణించే విద్యార్థులు తెలంగాణకు గర్వకారణమని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయాలు, వ్యాపారాల్లోని ఉ న్నతస్థాయి వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు
ప్రభుత్వ పాఠశాలలో సెమీరెసిడె న్షియల్ విధానాన్ని అమలు అంశా న్ని పరిశీలిస్తున్నాం
రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదం డ్రులు, పిల్లల మధ్య బంధాలు బల హీనపడుతున్నాయి
పదో తరగతిలో 10 జీపీఏ సాధిం చిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్(Vande Mataram Foundation) ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మట్టిలో మాణిక్యాల్లా రాణించే విద్యార్థులు తెలంగాణకు గర్వకారణమని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy) పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయా ల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తు లందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనని,ప్రధాని మో దీ, ఏపీకి కాబోయే సీఎం చంద్రబా బుతో(Chandrababu naidu) పాటు తాను కూడా సర్కారు బడిలో చదువుకున్న వాళ్లమేనని తెలిపారు. దేశంలోని 90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించి పట్టుదలతో ఉన్న తస్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠ శాలల్లో సెమీ రెసిడెన్షియల్ (Semi Residential schools)విధా నాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూ ళ్ల వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని, అం దుకే దీనిపై ఆలోచిస్తున్నామని వ్యా ఖ్యానించారు. విద్యార్థులు గురుకు ల స్కూళ్ల కంటే గ్రామాల్లోని పాఠశా లల్లో చదువుకుంటేనే తల్లిదండ్రు ల కు దగ్గరగా ఉండే అవకాశం ఉం టుందన్నారు.సోమవారం రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధిం చిన 230 మంది విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో రవీంద్రభారతిలో సీఎం రేవంత్ చేతులమీదుగా ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మా ట్లాడుతూ తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల లో చదివే పిల్లలతో ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు పోటీపడి ఎదుగుతుండడం సంతోషం కలిగి స్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి తమ ప్రభుత్వ గౌరవా న్ని పెంచారని ప్రశంసించారు. నిజా నికి ఈ సత్కారం తామే అధికారి కంగా చేస్తే బాగుండేదని, వందే మాతరం ఫౌండేషన్ ఈ కార్య క్రమాన్ని నిర్వహించి తమ బాధ్య తను గుర్తు చేసిందన్నారు. ఇదిలా ఉండగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలను వి ద్యార్థులు లేరనే సాకుతో మూసివే సిందని సీఎం రేవంత్(CM Revanth Reddy) విమర్శించా రు. మౌలిక వసతులపై దృష్టి పెట్ట నందునే అలాంటి పరిస్థితి ఏర్పడిం దన్నారు. తమ ప్రభుత్వం ఆ స్కూ ళ్లను యథావిధిగా కొనసాగించేం దుకు చర్యలు తీసుకుందని తెలి పారు. ప్రతి గ్రామం, ప్రతి తండా లోని పిల్లలకు విద్యనందించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్ నిర్మించేందుకు రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభించామని వెల్లడిం చారు.
బడి బయటి విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా గత ప్రభుత్వానికి భిన్నంగా మహిళా సం ఘాలకు అప్పగించామని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను నియమించి వారికి స్కూల్ నిర్వహణ, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల స్కూల్ డ్రెస్సు ల బాధ్యతను అప్పగించామని గుర్తు చేశారు. కమిటీలకు గ్రీన్ చాన ల్ (Green Channel) ద్వారా నిధులు విడుదల చేయా లని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి అని పేర్కొన్నారు. ఈ పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుం దని, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవా రు సొంత గ్రామాల్లో అభివృద్ధి పను లు చేసేందుకు ఉత్సాహం చూపిం చడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు.
best education in Government schools