బిగ్ బ్రేకింగ్, నిర్మాణంలోని భవనం కూలీ ఏడుగురి దుర్మరణం
bhadrachalam: ప్రజా దీవెన, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న భవ నం కుప్పకూలింది. అత్యంత ప్రమాద భరి తంగా జరిగిన ఈ దుర్ఘట నఘతో పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలడంతో ఏడుగురు చని పోయి నట్టు తెలుస్తోంది. పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ భవనం నిర్మాణంలో ఉండగా మధ్యహ్నం ఒక్క సారిగా నేలమట్టమైంది.
శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు సమాచారం. కాపాడండి, రక్షిం చండి అనే ఆర్తనాథాలతో ఆ ప్రాంతం మారుమోగింది. దీంతో అక్క డికి చేరుకున్న స్థానికులు కాపాడేం దుకు ప్రయత్నిస్తున్నారు. సమా చారం అందుకున్న డిజాస్టర్ టీమ్ వెంటనే సహాయక చర్యలు చేప ట్టింది. మృతుల సంఖ్య మరింత పెరగ నున్నట్టు తెలుస్తోంది. మరి న్ని పూర్తి వివరాలు తెలియాల్సింది.