–మంత్రిని కలిచిన భాగ్యలక్ష్మి దేవా లయం ధర్మకర్తలు
Bhagyalakshmi Bonalu:ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్య లక్ష్మి (Bhagyalakshmi) అమ్మవారి దేవాలయ ధర్మ కర్తలు/దేవాదాయశాఖ అధికా రులు శుక్రవారం రోడ్లు భవ నా లు,సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) వారి నివాసంలో కలిసి బోనాల ఉత్స వానికి ఆహ్వానించారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లపై ఆరాతీసిన మం త్రి భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి (Goddess Bhagyalakshmi) బోనాలకు హైదరాబాద్ వ్యాప్తం గా భక్తులు హాజరవుతారని, ఎక్క డా పొరపాట్లకు తావులేకుండా చూ డాలని ఆదేశించారు.ఈ నెల 28వ తేదీన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల యంలో రాష్ట్రప్రభుత్వం అధికారికం గా నిర్వ హించే బోనాల కార్యక్ర మంలో (Bonala program) మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న అమ్మవారికి పట్టువస్త్రాలు, త లంబ్రాలు సమర్పిస్తారు.ఈ కార్యక్ర మంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ బాలాజీతో పాటు ఆల య ట్రస్టీ కుమారి శశికళ, సూర్యప్ర కాశ్, జానకి శరణ్, సచిన్ తదిత రులు పాల్గొన్నారు.