–ప్రభుత్వం ఇచ్చే నిధులు రైతుల ఇతర అప్పులకు మల్లిoచొద్దు
–మాఫీ జరిగిన వెంటనే కొత్త రుణా లు మంజూరు చేయాలి
–మాఫీలో బ్యాంకర్ల సహకారం కో రుతున్నాం చిన్న పొరపాటు జరగ డానికి అస్కారమివ్వవద్దు
–చరిత్రలో నిలిచిపోయే రోజైనందు న బ్యాంకుల వద్ద సంబరాలు జరపండి
రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం
–ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా రూ. 31 వేల కోట్లు ఈ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదు
–బ్యాంకర్ల సమావే శంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు రుణమాఫీ పై ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించా లని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థి తుల్లో జమ చేయడం ద్వారా రైతు లను ఇబ్బంది పెట్టొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు నెల దాటక ముందే 31 వేల కోట్లు రైతు రుణ మాఫీ కింద విడుదల చేస్తామని, గురువారం సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతుల (farmers)కు రూ. 6వేల కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు (Farmers’ loans) నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుద ల చేస్తామని చెప్పారు. గురువారం ప్రజా భవన్ లో జరిగిన రాష్ర్ట స్థా యి బ్యాంకర్ల సమావేశంలో వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావుతో (Minister Tummala Nage Swara Rao)కలసి పాల్గొన్నారు. రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో ప్రత్యేకంగా నిర్వహిం చిన సమావేశంలోరాష్ట్రంలోని అ న్నీ స్థాయిల బ్యాంకర్లు హాజర య్యారు. రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల తో బ్యాంకర్లు మాట్లా డి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవం త్ రెడ్డి, సీఎల్పీ (Revamth Reddy, CLP)నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంత కం చేసి ప్రచారంలోకి వెళ్ళామని, ఇచ్చిన మాట మేరకు కట్టుబడి తూచా తప్పకుండా రైతు రుణమా ఫీని అమలు చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. 40 లక్షల బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ. 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడిం చారు. భారతదేశ బ్యాంకింగ్ చరిత్ర (History of Banking in India)లోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అభివర్ణించారు. కార్పొరేట్ బ్యాం కింగ్ సెక్టర్ లోను ఇంత పెద్ద మొ త్తంలో ఒకేసారి రికవరీ కాలేదని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణ యం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమని, ఈరోజు రైతులు ఎలాగా పండుగ చేసుకుంటున్నారు బ్యాంకర్లు కూడా అదే విధంగా పం డుగ చేసుకోవాలని కోరారు. వ్యవ సాయ రంగ అభివృద్ధి కోసం భవి ష్యత్తులో అనేక కార్యక్రమాలను మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రాబో తుందని అన్నారు. ఈ రాష్ట్ర జిఎస్ జిడిపి లో 16.5% వ్యవసాయ రం గం నుంచి వస్తుందని, రాష్ట్రంలో 45% పైబడి ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని చెప్పారు.
రైతు రుణమాఫీ (Farmer loan waiver)కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసు కొని, భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూ రు చేయాలని, లోన్లు ఇచ్చే విష యంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దని, లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించా లి కోరారు. రైతు రుణమాఫీ నేప థ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరుపుకోవాలని విస్తృ తంగా ప్రచారం చేయాలని అప్పీల్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao)మా ట్లాడుతూ ఒకే నెలలో రూ. 30 వేల కోట్లు రైతు రుణమాఫీ దేశ చరిత్ర లోనే గర్వించదగిన రోజనీ, మన్మో హన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమ యంలో దేశవ్యాప్తంగా రైతు రుణ మాఫీ కింద చేసిన వ్యయం రూ. 70 వేల కోట్లు మాత్రమేనని, ఒక రాష్ట్రంలోనే రూ. 30 వేల కోట్లు అంటే ఆలోచన చేయండని సూచిం చారు. రైతు రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు లాంటివారు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. రుణమాఫీ సమ యంలో బ్రాంచీల వద్ద తొక్కిసలాట జరగకుండా గ్రామాల వారిగా తేదీ లు ప్రకటించి రైతు రుణమాఫీని సజావుగా జరిగేలా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
వర్షాలు మొదలయ్యాయని కృష్ణ గోదావరి జిల్లాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, రైతు రుణ మాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం (agriculture) పండుగల మారు తుందని, గత ప్రభుత్వం లక్ష రూపా యల రుణమాఫీని నాలుగు సార్లు విడుదల చేస్తే అవి వడ్డీకే సరిపో యాయని గుర్తు చేశారు. రెండోసారి రైతు రుణమాఫీ కింద 20 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం పది నుంచి 11 కోట్లు మాత్ర మే విడుదల చేశారనీ వివరించారు.