Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: గంపగుత్తగా గురుకులాల ప్రక్షాళన

–సమృద్ధిగా నిధులు సమకూరు స్తాం
–మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకొక  రోజు గురుకులాల పర్యటన
–గురుకుల భవన నిర్మాణాలకు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు
–పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు తక్షణమే రూ. 50 లక్షలు మంజూ రు
–పెద్దాపూర్ లో విద్యార్థుల మృతి ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చే సింది
— పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి
–కంటతడి పెట్టిన తల్లిదండ్రులను ఓదార్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్

Bhatti Vikramarka:ప్రజా దీవెన, జగిత్యాల: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేసి ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. నెలలో ఒక రోజున రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గురుకుల పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో భోజనం (Lunch with students)చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగునంగా జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్వోలు సైతం నెలలో ఒక రోజున గురుకుల పాఠశాలలో బస చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంగళవారం డిప్యూటీ సీఎం సందర్శించారు. గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాల గురించి విద్యార్థులు తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర దుక్క సాగరంలో ఉన్న తల్లిదండ్రుల ఆవేదనను చూసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం వారితో సమావేశమయ్యారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్ పెట్టడానికి ముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను తెలుసుకొని విద్యా, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు.  రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా గురుకుల పాఠశాలల పక్క భవనాల నిర్మాణం కోసం  ఈ బడ్జెట్ లో ప్రజా ప్రభుత్వం రూ. 5వేల కోట్లు కేటాయించిందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత పాలకులు గురుకుల పాఠశాలల పక్కా భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా అర కొర వసతుల మధ్యన నేడు విద్యార్థులు (The students) అనుభవిస్తున్న దుస్థితి అని పేర్కొన్నారు.‌ గురుకుల పాఠశాలల పక్క భవనాల నిర్మాణం కొరకు గత ప్రభుత్వం 2015 -16 ఆర్థిక సంవత్సరంలో 197 కోట్ల కేటాయించగా 2016 17 ఆర్థిక సంవత్సరం నాటికి 116 కోట్ల రూపాయలకు కుదించిందన్నారు. 2018- 19 సంవత్సరంలో  రూ. 79 కోట్లు, 2019-20 వార్షిక సంవత్సరంలో 70 కోట్లు, 2020-21 వార్షిక సంవత్సరంలో కేవలం 11 కోట్లు, 2021-22 వార్షిక సంవత్సరంలో 9 కోట్లు, 2022-23 వార్షిక సంవత్సరంలో ఏడు కోట్లు, 2023 24 వార్షిక సంవత్సరానికి మూడు కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలని ప్రపంచంతో పోటీపడే విద్యను అందించాలని విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో పెద్దాపూర్ లో ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం ప్రజా ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిచిసి వేసిందని బాధపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పక్క భవనాల నిర్మాణం కోసం కావలసిన నిధులు, భవనాల నిర్మాణ కావలసిన స్థల సేకరణకు అయ్యే నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రభుత్వ హాస్టల్స్ లో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డ్స్ ఉండేదనీ,  ప్రతి నెల డాక్టర్లు వచ్చి వారి ఆరోగ్యాన్ని చెక్ చేసి కార్డులో రాసే వారని గుర్తు చేశారు. అదేవిధంగా  ప్రభుత్వ హాస్టల్లో నే పారామెడికల్ స్టాఫ్ ఉండేవారని. అ విధానాన్ని తిరిగి తీసుకురావాలని గురుకులాల  సెక్రటరీని (Secretary) ఆదేశించారు

విద్యార్థుల డైట్ చార్జీల పెంపునకు కమిటీ వేస్తాం

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు (Diet charges) పెంచడానికి త్వరలోనే అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించారు.  కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత డైట్ చార్జీలను పెంచుతామని వెల్లడించారు. గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నేలపైన పడుకోవడానికి వీలులేదని కచ్చితంగా మంచం, బెడ్, బెడ్ షీట్ ను ప్రభుత్వ సమకూర్చుతుందని ఇందుకోసం ప్రతిపాదనలు పంపితే నిధులు విడుదల చేస్తామని గురుకులాల సెక్రటరీ రమణ కుమార్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి గురుకులంలో అత్యవసర ఔషధాలు, పారా మెడికల్ స్టాఫ్, కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గురుకులాల సెక్రెటరీని ఆదేశించారు.  శుచి, శుభ్రత (Shuchi, cleanliness)పాటిస్తూ నాణ్యత గల ఆహారాన్ని అందించాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో టాయిలెట్స్, బాత్రూమ్స్ విద్యార్థులకు అనువుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.  సమృద్ధిగా నీరు,  విద్యుత్తు, గురుకుల పాఠశాలకు కావలసిన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఈజీఎస్ పనుల కింద గురుకుల పాఠశాలలో చెత్తా, చెదారం పిచ్చి మొక్కలు తొలగించి, పండ్లు, ఔషధ మొక్కలు నాటించాలని చెప్పారు. గురుకులాల్లో పనిచేసే వార్డెన్స్, టీచర్స్, పారామెడికల్ సిబ్బంది రాత్రి సమయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని  ఆదేశించారు.

పెద్దాపూర్ పాఠశాలకు 50 లక్షలు మంజూరు

పెద్దాపూర్ గురుకుల పాఠశాల (Peddapur Gurukula School)ప్రాంగణంలో నీటి కుంటలు, చెత్తాచెదారం లేకుండా  అభివృద్ధి చేయడానికి, టాయిలెట్స్ నిర్మాణం కోసం ఇతర సౌకర్యాలు కల్పించడానికి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు మంజూరు చేశామన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా  డార్మీటరీ, డైనింగ్ హాల్స్, భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించిన వెంటనే ఒక్కరోజు ఆలస్యం చేయకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 12 ఎకరాలు ఉన్న పెద్దాపూర్ పాఠశాలలో భవన నిర్మాణం కోసం 2020-21 వార్షిక సంవత్సరంలో నిధులు మంజూరు చేసి విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులను ఆపి వేసినట్లు అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసిన వెంటనే ఆ నిధులు మా ప్రభుత్వం ఇస్తుందన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని, నీటి కుంటలు చెత్తాచెదారం లేకుండా చూడాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు చెప్పారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం అండ
మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు  (To parents of students)ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తో పాటు గురుకుల సొసైటీలో వారి విద్యా అర్హతకు అనుగుణంగా ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఇల్లు లేకుంటే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్టు చెప్పారు. మృతి చెందిన విద్యార్థుల పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దాని ఆధారంగా విచారణ ఉంటుందన్నారు.