–ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగూరతతో లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్
–రెవిన్యూ సమీక్షా సమావేశం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Bhatti Vikramarka:ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అ త్యంత పటిష్టంగా లే అవుట్ రెగ్యు లైజేషన్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) సిద్ధమవుతోంది. అందులో భాగంగా శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కార్యాలయలంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేంలోనే ఎల్. ఆర్.ఎస్ (L.R.S)విధివిధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించారు. ఎల్.ఆర్.ఎ (L.R.S)స్ వల్ల ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా చూడా లని అధికారుకలు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సూచిం చారు. ఎల్.ఆర్.ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు (applications)వీలైనంత వేగంగా పరిష్కరిం చాలని ఉప ముఖ్యమంత్రి అధికా రులకు సూచన చేశారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక టీములను రూపొందుకోవాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ తీసుకోవాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సెక్రెటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, జీహెచ్ఎంసీ కమి షనర్ కాట అమ్రపాలి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.