–బాధాకర సంఘటనలు పునరా వృతం కాకుండా చేస్తాం
–సంఘటన తీరుపై మంత్రి పొన్నం తో కలసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా
Bhatti Vikramarka: ప్రజా దీవెన, కరీంనగర్ :విద్యార్థులు మృతి చెందిన సంఘటనలు పున రావృతం కాకుండా చర్యలు తీసు కుంటానని డిప్యూటీ సీఎం చెప్పా రు.జగిత్యాల జిల్లా మెట్ పల్లి మం డలం పెద్దా పూర్ గురుకుల పాఠశా లను డిప్యూ టీ సీఎం భట్టి విక్రమా ర్క (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)పరి శీలించారు. ఈ సందర్భంగా విద్యా ర్థుల తల్లిదం డ్రులతో సమావేశమ య్యారు.ఇటీవల మృతి చెందిన విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈసంఘటనపై పూర్తి వివరాలు పంపించాలని గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిని విచారించారు. ఇది ఇలా ఉండగా గురుకుల పాఠశాల విద్యార్థుల మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)చలించిపోయారు.
అనంతరం గురు కుల పాఠశాలలో డ్యూటీ నర్స్ (Duty nurse) సం బంధించిన వివరాలపై ఆరా తీశా రు.కంటతడి పెట్టిన విద్యార్థుల తల్లి దండ్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రి పొన్నం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు (Parents of students) కంట తడిపెట్టారు. తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకున్నామని చెప్పారు. వారిని మంత్రులు ఓదార్చారు.
ఈ సందర్భంగా భట్టి (Bhatti Vikramarka) మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృ తం కాకుండా చర్యలు తీసుకుం టామన్నారు. సౌకర్యాలు కల్పిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభు త్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ, మేడిపల్లి సత్యం , సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.