–గనులు వేలం వేస్తే సహించేది లేదు
–డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
Bhattivikramarka: ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గుగను (coal) లను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే సహించేది లేదని ఉప ముఖ్య మంత్రి భట్టివిక్రమార్క (Bhattivikramarka) స్పష్టం చేశారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని ఉద్ఘటించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (thumala nageshwarao)కలిసి ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. బొగ్గు గనులన్నీ వేలం వేసేలా 2015లో కేంద్ర ప్రభు త్వం చేసిన చట్టానికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ (BRS)కూడా మద్దతు పలికి ఇప్పుడు దొంగాట ఆడుతు న్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత భవిష్యత్తుకు విఘాతం కలిగించేలా సింగరేణి సంస్థను దెబ్బతీసేందుకు గత కేసీఆర్(KCR) ప్రభు త్వం నాడు కేంద్ర చట్టానికి మద్దతు పలికిందని ధ్వజమెత్తారు. దీన్ని వ్య తిరేకిస్తూ తాను కాంగ్రెస్ తరఫున లేఖ రాసినట్లు భట్టి గుర్తు చేశారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం సింగరే ణి పరిధిలోని కోయగూడెం, సత్తు పల్లి బొగ్గు గనులను కేసీఆర్‌కు సం బంధం ఉన్న కంపెనీలకు అప్ప గించిందని ఆరోపించారు. సింగరేణికే (singareni)ఈ ప్రాంత బొగ్గు గనులను కేటాయించాలంటూ అఖిలపక్షంతో వెళ్లి ప్రధానమంత్రిని కోరతామని తెలిపారు. ఇందుకు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రం తరఫున చొరవ తీసుకోవాలని కోరా రు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను సంస్థకే కేటా యించాలని శుక్రవారం కిషన్‌రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న గనుల్లో 2033 వరకే బొగ్గును తవ్వుకునే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేటాయించాలని, ఎట్టి పరిస్థితుల్లో నూ ప్రైవేటు సంస్థలకు అప్పగించ వద్దని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తాము కేంద్రం తో పోరాడి తీరతామన్నారు. అవస రమైతే గత చట్టంలో మార్పులు చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్రా నికి (Telangana)చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kisan Reddy)ఇందుకు సహకరించాలని కోరారు. గోదావరి లోయలోని బొగ్గు నిక్షేపా లను సింగరేణికి కేటాయించకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ని బీజేపీ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించారని భట్టి ఆరోపించారు. వారికి సన్ని హితమైన ఆరో, అవంతిక, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు దక్కేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజ మెత్తారు. వాస్తవాలను పక్కనపెట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచా రం చేస్తూ సింగరేణి కార్మికులను, ప్రజలను పక్కదారి పట్టించేదుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లలో సింగరేణి సంస్థను ఎలా దెబ్బతీశారో, కార్మికుల సంఖ్య ఎలా కుదించారో అందరికీ తెలుస న్నారు. సింగరేణి కార్మికులు తెలం గాణ రాష్ట్ర సాధనలో కీలక భూ మిక పోషించారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kisan Reddy)ఈ విషయాన్ని పరిగణ నలోకి తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్లు ఉమ్మడి వ్యూహం తోనే 2015లో బొగ్గు గనులన్నిం టినీ వేలం వేసేలా చట్టాన్ని రూపొం దించాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సిగరేణిని కాపాడు కునే విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
*గనులతో మాకు సంబంధం లేదు:* ….సత్తుపల్లి బొగ్గు గనిని తాము దక్కించుకున్నట్లు భట్టి విక్ర మార్క చేసిన ఆరోపణలను ప్రతిమ ఇన్ఫ్రా తీవ్రంగా ఖండించింది. సింగ రేణితో తమకెలాంటి సంబంధాలు లేవని ప్రతిమ ఇన్ఫ్రా ఉపాధ్యక్షుడు పి.అనిల్‌కుమార్ (Anil Kumar)తెలిపారు.