Bhikshapati : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : శ్రీ సరస్వతి శిశు మందిర్ రవీంద్ర నగర్ నల్గొండ శ్రీ పంచమి సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బిక్షపతి మరియు నల్గొండ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అరుంధతి విచ్చేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ పాఠశాల లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చిన్నారులకు గొప్ప అదృష్టం ఇలాంటి పాఠశాలలు ఇంకా మునుముందు దినదినాభివృద్ధి చెందాలే విద్యయే ప్రధానము డబ్బు ప్రధానం కాదు అని చెప్పి పిల్లలకు పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి సందేశం ఇచ్చారు. పిల్లలని ఇలాంటి పాఠశాలలో సంస్కృతి సంప్రదాయాలు దేశము విలువలతో కూడిన విద్య అందిస్తుంది మన సనాతన ధర్మము ఇలాంటి పాఠశాలల ద్వారా పిల్లలకు నేర్పిస్తారు, కావున ఈ పాఠశాలలో పిల్లలని విద్యను అభ్యసించడం చాలా గొప్ప శుభ పరిణామం అని చెప్పి చెప్పడం జరిగింది .
ఈ యొక్క సరస్వతి శిశు మంది పాఠశాలలో శాస్త్రోప్తంగా ప్రతి సంవత్సరం గణపతి పూజ అమ్మవారి ప్రతిమ బాసర అమ్మవారి కుంకుమ ఇచ్చి మరియు యజ్ఞ సహిత కార్యక్రమం నిర్వహించి హోమం ముందర పిల్లలకు ఉచితంగా పలక బల్పం పండ్లు పలహారము ఇచ్చి సామూహిక అక్షరాభ్యాసము చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య వక్తగా పూజనీయులు వేద పండితులు ఆర్కే వేదాంతం గురూజీ విచ్చేసి సనాతన ధర్మము విద్యా విలువలు ఉమ్మడి కుటుంబాలు వైదిక శిష్టాచారము తదితర చాలా విషయాలను పిల్లలకు తల్లిదండ్రులకు సందేశాత్మకంగా ప్రవచనం చేశారు, మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు విద్యావేత్తలు, విద్యాదాతలు విచ్చేశారు. పాఠశాల కమిటీ సభ్యులు , దోసపాటీ శ్రీనివాసులు, చిలుకూరి పరమాత్మ, ప్రభాకర్, తిరందాసు లక్ష్మీనారాయణ, గోవింద సుధాకర్, మిట్టపల్లి రాజేందర్ మరియు పాఠశాల ప్రధాన మాతాజీ కట్ట అనిత పాఠశాల ఆచార్యుల బృందం, మాతాజీలు, పోషకులు, విద్యార్థులు, ఈ కార్యక్రమానికి అత్యధికంగా విచ్చేసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి దాతలు ఆర్థిక సహకార అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.