— భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy :ప్రజా దీవెన, శాలి గౌరారం: భూ స మస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభు త్వం భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చిందని భువనగిరి పార్ల మెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీ సుకువచ్చిన ధరణి పోర్టల్ లో భూ సమస్యలకు పరిష్కారం లేదని, అ లాంటిది భూ భారతిలో రైతుల భూ సమస్యలకు పరిష్కారం దొరు కుతుందన్నారు. ఇందుకు గాను అధికారులే భూ సమస్యలను ప రిష్కరించేందుకు గ్రామాలకు వస్తా రని, రైతులు వారికున్న భూ సమ స్యలను అధికారులు దృష్టికి తీసు కురావాలని సూచించారు.
భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహి స్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నల్గొండ జి ల్లా శాలి గౌరారం మండల కేంద్రం లో నిర్వహించిన భూ భారతి అవ గాహన సదస్సుకు ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ధరణిలో సమస్యలు పరిష్కరించేం దుకు అధికారులకు కూడా అవకా శం ఉండేది కాదని, భూ భారతిలో సమస్యలను పరిష్కరించే అధికా రం తహసిల్దార్ నుండి మొదలు కొని జిల్లా కలెక్టర్ వరకు ఇవ్వడం జరిగిందని, 80 శాతం సమస్యలు తహసిల్దార్ వద్దనే పరిష్కారం అవుతాయని ఎంపి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం వ చ్చిందని, ప్రజా ప్రభుత్వమని, రైతు భరోసా, సన్న బియ్యం, రైతు రుణ మాఫీ, భూభారతి వంటి అనేక ప్ర తి ష్టాత్మక పథకాలను అమలు చే స్తున్నట్లు తెలిపారు.
తుంగతుర్తి శాసనసభ్యులు మం దుల సామెల్ మాట్లాడుతూ మని షికి జీవనాధారమైన భూమి సమ స్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తె చ్చిందన్నారు.ధరణి వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రభు త్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొచ్చిందన్నారు. ధరణిలో కొం తమంది మాత్రమే లబ్ధి పొందారని, తమ ప్రభుత్వం భూ సమస్యలకు పరిష్కారం కల్పించే విధంగా స్పష్ట మైన చట్టం భూభారతి ని తీసుకు వచ్చిందన్నారు. దీనిని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదని, ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతు భరోసా, రైతు బీమా వంటివి అమలు చేయ డం జరుగుతున్నదని, అలాగే రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, దాం తోపాటు ఇటీవల సన్న బియ్యం వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని అమ లు చేసిన ఘనత తమ ప్రభుత్వా నికి ఉందని అన్నారు.
శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధరణిని రద్దుచేసి కొత్త చట్టం తీసుకొస్తామ ని చెప్పిన విధంగానే భూ భారతి కొత్త చట్టం తీసుకురావడం జరిగిం దని, తమ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం వల్ల ఎవరు కోర్టుకు, ట్రిబ్యు నల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని, 80% భూ సమస్యలు తహసిల్దార్ తో,తక్కినవి ఆర్డీవో ,జిల్లా కలెక్టర్ ద్వారానే పరిష్కారం అవుతాయని తెలిపారు.అనేక సంక్షేమ కార్యక్ర మాలను ప్రభుత్వం అమలు చేస్తు న్నదని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ ధరణిలో భూములకు సం బంధించి ఉన్న సమస్యలను భూ భారతిలో పరిష్కరించేందుకు ఉన్న వెసులుబాట్లను వివరించారు. రికా ర్డుల సవరణకు భూ భారతిలో ఆ అవకాశం ఉందని తెలిపారు. భూ ములకు సంబంధించిన రికార్డుల ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న గ్రామపంచాయతీ పరిధిలో ప్రదర్శించడం జరుగుతుందని, ఏవై నా తప్పులుంటే సరి చేసుకోవ చ్చ ని పేర్కొన్నారు . జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ అమల్లోకి వ స్తుందని, చట్టం ఇదివరకే అమలు లో ఉందని చెప్పారు. రైతులు భూ ములను ఎవరు అన్యాక్రాంతం చే సుకోవడానికి భూ భారతిలో అవ కాశమే లేదని, సరైన ఆధారాలు రి కార్డులు కలిగి ఉండి మోక మీద ఉంటే చాలు అన్నారు .
నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, భూభారతి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించారు.మార్కెట్ కమిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి, ప్రా థమిక వ్యవసాయ సహకార సం ఘం అధ్యక్షులు మురళి, వైస్ చై ర్మన్ నరసింహ, మహేందర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. తహసి ల్దార్ సైదులు సమావేశానికి అధ్య క్షత వహించారు. ఎంపీడీవో జ్యో తి, ఇతర మండల స్థాయి అధికా రులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ అవగాహన సదస్సుకు హాజ రయ్యారు.