Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhupal Reddy : నల్లగొండలో మితిమీరిన అధికార పార్టీ ఆగడాలు

— నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నా యకుల ఆగడాలు మితిమీరిపో తున్నాయని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజా పాలనలో ప్రజాస్వామ్యo కనుమ రుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క తమ యువనేత కేటీఆర్ రైతు ధర్నాకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, వ్యూహాత్మకంగా చివరి సమయoలో అధికార పార్టీ ఒత్తిడితో నిరాకరించారని గుర్తు చేశారు. నల్లగొండ మున్సిపాలిలో కాంగ్రెస్ బిఆర్ఎస్ల మధ్య జరిగిన రాజకీయ రగడ నిమజ్జంలో అరెస్ట్ అయిన భూపాల్ రెడ్డి పోలీస్ విడు దల అనంతరం మీడియాతో మా ట్లాడారు. నల్లగొండ మున్సిపాలిటీ లో మరొకపక్క నెలల తరబడి కాం గ్రెస్ ప్లెక్సీలు తొలగించని మున్సిప ల్ అధికారులు కేవలం బిఆర్ఎస్ పార్టీ ఎఫ్సీలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.ఫ్లెక్సీల తొలగింపు పై మున్సిపల్ కమిషనర్ ను అడుగ డానికి వస్తే అధికార పార్టీ నేతల గుండాలను వెంటవేసుకొని వచ్చి దాడులకు పాల్పడ్డారని ఆరోపిం చారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో గడిచిన ఐదేళ్లు ప్రశాం తంగా ఉన్న నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ నేతలు అశాంతి, అలజడ లకు గురి చేస్తున్నారని అగ్రహం వ్య క్తం చేశారు. ఏడాది గడవకముందే స్ధానిక పోలీసులు అధికార పార్టీ నేతలకు అంట కాగుతున్నారని ఆరోపించారు.మున్సిపల్ ఛాంబర్ ఎదుట మా కార్యకర్తలతో ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఏమిటో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, గ్రామసభ ల్లో అధికారులను ప్రజలు నిలదీస్తు న్న సంఘటనలో ఎందుకు నిదర్శన మని పేర్కొన్నారు. ప్రజాపాలన అం టే ప్రశ్నించే గొంతుకులను నొక్కడ మేనా అని ప్రశ్నించారు.

మంత్రి కోమటిరెడ్డి అనుచరుల అరాచకా లు పరాకాష్టకు చేరుకున్నాయని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజల లో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోక బిఆర్ఎస్ పార్టీ నాయ కులపై దాడులు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఐదేళ్లలో నల్లగొండ ము న్సిపాలిటీ ఏలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనిస్తు న్నారని సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చ రించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో కౌన్సిలర్లకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని, కోమటిరెడ్డి ఇద్దరి అనుచరుల చుట్టే పాలనను మొ త్తం నడిపిస్తున్నారని ఆరోపించా రు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఫైర్ల శేఖర్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ తదితరులు ఉన్నారు.