బిగ్ బ్రేకింగ్, భూపాలపల్లి హత్య కేసులో కీలక అప్డేట్
bhupalpallymurder : ప్రజా దీవెన భూపాలపల్లి: రాష్ట్రంలో సంచలన సంఘటనగా బుధవారం నలుమూలల అనేక అనుమా నాలకు తావిచ్చిన భూపా లపల్లి హత్య కేసులో కీలక అప్డేట్ లభిం చింది. నిన్నటి రోజున భూపా లపల్లి జిల్లా కేంద్రంలో హత్యకు గు రైన మాజీ కౌన్సిలర్ భర్త రాజలిం గమూర్తి హత్య కేసులో పురోగతి సా ధించారు పోలీసులు.
హత్యకు గురైన రాజలింగమూర్తికి రేణికుంట్ల కొంరయ్య, రేణికుంట్ల సంజీవ్ తో భూవివాదం నెలకొని ఉందని ఆ కో ణంలోనే హత్య జరి గి ఉంటుంద ని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ కు వచ్చినట్లు తెలి సింది. ఈ మేరకు రేణుకుంట్ల సంజీవ్, సంజీవ్ బావ మరిది శీమంత్ ను పోలీసులు అ దుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీ యవర్గాల ద్వా రా తెలియగామరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని సమా చారం.
పరారీలో ఉన్న వారిలో మోరె కుమార్, కొత్తూరి కుమార్ గా ఇప్పటికే పోలీసులు నిర్ధారించుకున్నారు. హత్య జరిగిన మరుక్షణం నుంచి రకరకాల కార ణాలు వెలుగులోకి వచ్చిన విష యం తెలిసింది. కాళే శ్వరం అవినీ తి, అక్రమాల మీద ఫిర్యాదు చేయ డం మూలంగానే ఈ హత్య చేశా రని తప్పుడు సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్ర చారంలోకి తీసుకె ళ్లారని అధికార పార్టీ నేతలపై విమర్శలు వెల్లు వెత్తున్నాయి.