Big Breaking :ప్రజా దీవెన మహబూబ్ నగర్ : మహబూబ్‌న గర్ జిల్లాలో ఘోరం సంఘటన చోటు చేసుకుంది. జిల్లా లోని మక్తల్ మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగుపాటుకు గురై ఇ ద్దరు మృతి చెందారు. ఆదివారం వాతావరణంలో మార్పులో భాగం గా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిన సంఘటన లో పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
మధ్యాహ్నం రెండున్నర గంటలకు భారీ స్థాయిలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమై సూపర్‌పల్లి గ్రా మం వద్ద పిడుగు పాటుకు గురై భ వన నిర్మాణ కార్మికుడు అంజప్ప (30) అనే వ్యక్తి మృతి చెందాడు. దాదనపల్లి గ్రామంలో కురువ కురు మూర్తి (16) అనే యువకుడు సై తం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.