Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్,జనజీవన స్రవంతిలోకి ఆశన్న బృందం, మావోయిస్టు చరి త్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు 

Big Breaking : ప్రజా దీవెన, ఛత్తీస్ ఘడ్: భారత దేశం వ్యాప్తంగా అతి కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మా వోయిస్టు ఉద్యమ చరిత్రలో తాజా పరిణామమే మరో అతిపెద్ద లొంగు బాటుగా చెప్పుకోవచ్చoటున్నారు పరిశీలకులు. చాలా రోజులుగా ప్ర చారం కొనసాగుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగా పూర్ గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఛత్తీస్గఢ్ సీఎం వి ష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపో యారు. వారితో పాటు మరో 208 మంది పార్టీ సభ్యులు కూడా స రెండర్ కాగా వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.

ఈ సందర్భంగా వారు భారీగా తు పాకులు, మారణాయుధాలను పో లీసులకు స్వాధీనపరిచారు. వాటి లో 153 తుపాకులు, 11 గ్రనేడ్ లాంచర్లు, 41 సింగిల్ షాట్ గన్స్, లైట్ మెషీన్ గన్స్ ఉన్నాయి.

మొత్తానికి సరెండర్ అయిన వారి లో అగ్ర నేతల్లో ఆశన్నతో పాటు డీ కేఎస్ఆడ్సీ సభ్యులు భాస్కర్ అలి యాస్ రాజామన్ మాండవి, నిత, రాజు సలాం, ధన్ను వెట్టి అలియాస్ సం తు, మావోయిస్టు పార్టీ ప్రాంతీ య కమిటీ రతన్ ఎలామ్ ఉన్నా రు.

ఇదిలా ఉండగా 208 మంది మా వోయిస్టులు ఒకే సారి లొంగిపోవడం చారిత్రక దినం అని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ఆయు ధాలు వదిలిపెట్టిన మావోయిస్టు లకు పునరావాసం కల్పిస్తామ న్నా రు. హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు లకు సీఎం విష్ణుదేవ్ సాయ్ సూ చించారు.