Big breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: అతి ఆత్మవిశ్వాసం, ముందు చూపులేని కుర్రతనం వెరసి ముగ్గురి ప్రాణాలు బలిగొనేందుకు దారి తీసింది. ద్వి చక్ర వాహనంపై మితి మీరిన వేగం, నిర్లక్ష్యానికి ముగ్గురు యువకులు తమ ప్రాణాలను బలిచ్చారు. రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయారు. మృతుల ను బహదూర్‌పురా, తలాబ్‌కట్టకు చెందినవారిగా గుర్తించారు.
మంగళవారం తెల్లవారుజామున బహదూర్‌పురాకు చెందిన అహ్మ ద్, మాజ్ ఖాద్రి, తలాబ్‌కట్టకు చెందిన సయీద్ అనే ముగ్గురు ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై బహదూ ర్‌పురా నుంచి ఆరాంఘర్ వైపు ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు. స్టంట్లు చేస్తూ అతివేగంతో దూసుకెళ్తు న్నారు. ఈ క్రమంలో శివరాంపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఫ్లైఓవర్‌పై ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టింది.
అనంతరం అది డివైడర్ వైపు దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మరణించారు. మరొకరు హాస్పిటల్‌లో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మైనర్లని వెల్లడించారు. మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.