Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 3:37 pm Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, దేవరకొండలో అమా నుష ఘటన, బుర్ఖాలో వచ్చిరోకలి తో దాడి 

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: న ల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం లో అమానుష సంఘటన చోటు చే సుకుంది. ఓ గుర్తు తెలియని మహి ళ రోకలి బండతో వృద్ధురాలిపై దా డి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుర్ఖాలో ధరించి వచ్చిన గుర్తు తెలి యని మహిళ రోకలిబండతో గాంధీ నగర్‌కు చెందిన వృద్ధురాలు కొండో జు భాగ్యమ్మ వయస్సు 70పై దారు ణంగా దాడి జరిగింది.

బాధితురాలు పేర్కొన్న వివరాల ప్ర కారం ఆ మహి ళ మీ అబ్బాయికి డబ్బులు ఇవ్వాలని నెపం చెప్పి ఇం ట్లోకి చేరింది. ఆ మాటలతో దగ్గర య్యి, అకస్మాత్తుగా రోకలిబండతో వృద్ధురాలి తలపై బలంగా దెబ్బకొ ట్టింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మార స్థితిలోకి వెళ్లిన భాగ్యమ్మను కుటుం బ సభ్యులు ఆసుపత్రికి తరలించా రు. తలకు ఎనిమిది కుట్లు వేసిన ట్లు వైద్యులు తెలిపారు. ఈ దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.“హత్య చేయా లన్న ఉద్దేశ్యమా లేక ఆభరణాలు దొంగిలించాలన్న ప్లానా?” అన్న సందేహంలో ఉన్నారు.

ఈ ఘటన లో మరో ట్విస్ట్ ఏమి టంటే ఆరు నెలల క్రితం బాధితు రాలి ఇంటి నుండి మాయమైన రోకలి బండ అదే రోకలిబండను ఉపయోగించి బుర్కాలో వచ్చిన మహిళ దాడి చేయడం.ఈ అనూ హ్య సంఘటనతో దేవరకొండ పట్ట ణంలో ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యారు.బాధితురాలు మరి యు కుటుంబ సభ్యులు దేవరకొం డ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.