Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big breaking : బిగ్ బ్రేకింగ్, భాగ్యనగరానికి బుల్లె ట్ రైలు, హైదరాబాద్ ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్

Big breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి క బురు అందించింది. భాగ్యనగరా నికి బుల్లెట్ రైలు, హైదరాబాద్ ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారి డార్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ కు సంబం ధించి దీనిని బెంగళూరు, చెన్నై వరకు విస్తరించే యోచనలో ఉ న్న ట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధా న నగరాలను బులెట్ రైలుతో అ ను సంధానించే భారీ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు పడినట్లు చెప్పవ చ్చు. తద్వారా హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నైకి ఇక రెండు మూడు గంటల్లోనే ప్రయా ణం కొనసాగనుంది. హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజు లు ఎంతో దూరంలో లేవని రైలు ప్రయాణికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అను సంధానించే భారీ ప్రాజెక్టుతో ఎట్టకేలకు మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలో మీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూ రు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైద రాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెం గళూరుకు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి కుదించపడుతుంది.

ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపా న్ తయారీ బుల్లెట్ రైలు నడవ నుంది. ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ కారిడార్లు నిర్మించను న్నా రు. వాటిలో పైన పేర్కొన్న హైదరా బాద్-ముంబై, హైదరాబాద్- బెంగ ళూరు, హైదరాబాద్-చెన్నై మార్గా లు కూడా ఉన్నాయి. వీటిలో హైద రాబాద్-చెన్నై, హైదరాబాద్- బెంగ ళూరు కారిడార్లను ఎలివేటెడ్, భూ గర్భ మార్గాల్లో నిర్మించనున్నారు.
హైదరాబాద్-బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు. సాధా రణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 11 గంటలు, వందే భారత్‌లో ఎనిమిదిన్నర గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. అలాగే, హైదరాబాద్-చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అయితే 15 గంట ల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గపోతుంది. అయితే, ఈ ప్రాజె క్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తు న్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభు త్వం కొత్త రైలు ప్రాజెక్టు మంజూరు చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.