CI Suspended in Kodad : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్ట ణానికి చెందిన కర్ల రాజేష్ రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన కేసు లో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిoచారు. ఈ సం ఘటనలో ఇప్పటికే డీఎస్పీ శ్రీధర్ రె డ్డి బదిలీ కాగా తాజాగా సీఐ పై స స్పెన్షన్ వేటు పడింది. కోదాడ రూ రల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయనికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉ న్నతాధికారులు ఉత్తర్వులు జారీచే సినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టిం చిన రాజేష్ కేసులో పోలీసులపై తీ వ్ర విమర్శలు వచ్చినందున అధికా రులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజేష్ మృతికి కారకు లైన పోలీసులపై చర్యలు తీసుకో వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృ ష్ణ మాదిగ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆం దోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ సంచలనాత్మక సంఘటన కేసులో తదుపరి విచా రణ అనంతరం మరి కొంత మంది బాధ్యులైన పోలీసులపై కూడా వే టుపడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.