Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లో హృదయ విదారక దుర్ఘ టన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్‌స్టేష న్ పరిధిలో గల పద్మానగర్‌లో ఓ త ల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.
స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బాలానగర్ కు చెందిన సాయిలక్ష్మి అనే మహిళ తన రెండేళ్ల కవల పిల్ల లకు గొంతునులిమి ప్రాణాలు తీశా క, మూడో అంతస్తు నుంచి దూకి ఆ త్మహత్య చేసుకుంది.సాయిలక్ష్మి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ లూరు జిల్లా నూజివీడు కాగా భర్త అనిల్‌కుమార్‌తో గొడవలే ఈ ఘోర ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కే సు నమోదు చేసిన పోలీసులు ద ర్యాప్తు జరుపుతున్నారు.