Pasamailaram Factory Accident : ప్రజా దీవెన, పటాన్ చేరు: దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన తెలం గాణ సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచికెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం పె ను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతు ల సంఖ్య క్రమ క్రమంగా అంతకంత కు పెరుగుతోంది.ప్రమాద సమయం నుంచి ఇప్పటివరకు మృతుల సం ఖ్యను 42కు చేరినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ హృదయ విదారక పేలుడు ఘటనలో 42 మంది కార్మికులు మృతిచెందారు. వీటిలో నాలుగు మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకు గుర్తించగా ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు, క్షతగాత్రులు బీహార్, ఒ డిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వా సులుగా గుర్తించారు.
ఇదిలా ఉండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధి కారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పలు ఆస్పత్రుల్లో 35 మంది కార్మికులకి చికిత్స అందిస్తుండగా అందులో 11 మంది పరిస్థితి విష మంగా ఉండడం గమనార్హం.
తెలంగాణ చరిత్రలోనే ఘోర పారి శ్రామిక ప్రమాదంగా అధికారులు చె బుతున్నారు. ఘటనాస్థలిలో సింగ రేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్, హె డ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్న తాధికారులు పరిస్థితిని ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథి లాల ప్రక్రియ కొనసాగుతోoడగా పూర్తి స్థాయి తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో సిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలు కొన సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా పేలుడుతో చెల్లా చెదురుగా పడిన శిథిలాల కింద మరో 20 మంది ఉన్నట్లు తెలుస్తోం ది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 47 మంది గల్లంతు కాగా ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి వరకు చికిత్స పొందుతున్నారు. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉం డగా దాదాపు 57 మంది సరక్షితం గా ఇంటికి చేరుకున్నారు.
*కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి….* సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్ పాశమైలారం ఘటనా స్థలిని పరిశీలించనున్నా రు. అదే విధంగా చికిత్స పొందుతు న్న బాధితులను పరామర్శించను న్నారు.