Big Breaking :ప్రజా దీవెన, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ ( ED) అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ కేసులో (Betting App Case) ఈడీ అధికారులు నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు (Film Celeb rities) సోమవారం నోటీసులు జా రీ చేశారు. ఈడీ అధికారులు ఇప్ప టికే పలువురిని పోలీసులు విచా రించిన విషయం తెలిసిందే. ఈ క్ర మంలోనే సినీ ప్రముఖులు దగ్గు బాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీప్రసన్న లకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.
నోటీసుల్లో బాగంగా జులై 23న ద గ్గుబాటి రానా జులై30న ప్రకాష్ రా జ్, ఆగస్ట్6న విజయ్ దేవరకొండ, ఆగస్ట్ 13న మంచు లక్ష్మీప్రసన్న వి చారణకి హాజరవ్వాలని సదరు నో టీసుల్లో పేర్కొన్నారు. విదేశీ బెట్టిం గ్ యాప్‌లను వీరు ప్రమోట్ చేసిన ట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దగ్గుబాటి రానా, ప్రకా ష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మం చు లక్ష్మీప్రసన్నలని మనీ లాండరిం గ్ కోణంలో ఈడీ అధికారులు విచా రణ చేయనున్నట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినం దుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రెటీలకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చే యనున్నారు ఈడీ అధికారులు. ఇ ప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారం గా ఈడీ అధికారులు నమోదు చే శారు. సినీ సెలబ్రెటీలు బెట్టింగ్ యా ప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలు వురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతు న్నారు.
బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందా యి. ఈ క్రమంలో ఈడీ అధికారు లు, పోలీసులు ముమ్మరంగా దర్యా ప్తు జరుపుతున్నారు. ఎంతోమంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ఆత్మ హత్యలు చేసుకోవడంతో ఈడీ అధి కారులు, పోలీసులు ఈ కేసుని సీరి యస్‌గా తీసుకుని విచారణ జరు పుతున్నారు.