New Delhi Encounter : బిగ్ బ్రేకింగ్, దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్, బీహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం
New Delhi Encounter : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్ కౌంటర్ సంచలనం రేకెత్తించింది. ఎ న్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలు గురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. చనిపోయిన హ తుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు దిల్లీ పోలీసులు ప్రకటించా రు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీ సుల జాయింట్ ఆపరేషన్‌లో మొ త్తం నలుగురు గ్యాంగ్‌స్టర్లు హత మయ్యారు.
దేశ రాజధానిలో ఈ ముఠా కదలిక లపై నిఘా వర్గాలు అందించిన స మాచారం మేరకు ఈ ఎన్‌కౌంటర్ ని ర్వహించినట్లు వెల్లడవుతోoది. గు రువారం తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్ స్టర్లను, రంజన్ పాఠక్ (25), బిమ్లే ష్ మహ్తో అలియాస్ బిమ్లేష్ సా హ్ని (25), మనీష్ పాఠక్ (33), అ మన్ ఠాకూర్ (21) గా పోలీసులు గుర్తించారు.
ఈ నలుగురు నిందితులు బీహార్ లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ‘సిగ్మా,అండ్ కంపె నీ’ పేరుతో చెలరే గుతున్న ఈ ము ఠాకు రంజన్ పాఠక్ వహిస్తున్నాడు. బీహార్‌లో నమోదైన అనేక కేసుల్లో ఈ నలుగురు పరారీలో ఉన్నారు.
బీహార్ ఎన్నికలకు ముందు ఈ న లుగురు పెద్ద కుట్రకు ప్రణాళిక వే స్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంత లో ఢిల్లీ, బీహార్ పోలీసు బృందాలు వారిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చ డం విశేషం. కాగా ఢిల్లీలోని కరావా ల్ నగర్‌కు చెందిన అమన్ ఠాకూర్ తప్ప, మిగిలిన ముగ్గురు గ్యాంగ్‌స్ట ర్లు బీహార్‌లోని సీతామర్హికి చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.